తొమ్మిదో అంతస్తు నుండి దూకి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య... భర్త వేధింపులు భరించలేక

Published : Apr 06, 2019, 07:58 AM ISTUpdated : Apr 06, 2019, 08:01 AM IST
తొమ్మిదో అంతస్తు నుండి దూకి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య... భర్త వేధింపులు భరించలేక

సారాంశం

ఎన్నో ఆశలతో ఆమె కొత్త జీవితాన్ని ప్రారంభించింది. టిసిఎస్ వంటి ప్రముఖ కంపనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం. భర్త కూడా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. ఇలా మంచి  ఉద్యోగాల్లో వున్న తామిద్దరం కలిసి జీవితాన్ని ఆనందంగా గడపాలన్న ఆమె కోరిక నెరవేరలేదు. కొత్తగా అత్తవారింట్లో అడుగుపెట్టినప్పటి నుండి ఆమెకు నిత్యం వేధింపులే ఎదురయ్యాయి. వీటిని తట్టుకోలేక పుట్టింటికి చేరినా ఆమెను భర్త మానసికంంగా వేధించడం మాత్రం ఆపలేదు. అయితే ఎప్పటికైనా అతడిలో మార్పు వస్తుందని అనుకుంటూ వాటిని భరిస్తున్న ఆమెకు భర్త విడాకుల నోటీసులు పంపించి షాకిచ్చాడు. దీన్ని తట్టుకోలేక పోయిన వివాహిత అత్తింటివారు నివాసముండే అపార్టుమెంట్ భవనం పైనుండి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదం హైదర్ నగర్ లో చోటుచేసుకుంది. 

ఈ విషాద సంఘటన  గురించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కూకట్ పల్లి సమీపంలోని నిజాంపేటకు చెందిన చిప్పడ మేఘన(30)ను హైదర్‌నగర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కొత్తపల్లి వినయకుమార్‌కి (32) తో రెండేళ్లక్రితం వివాహమయ్యింది. అయితే కొత్త సంసారం ప్రారంభించిన మొదట్లోనే భార్యాభర్తల మధ్య గొడవలు ఆరంభయ్యాయి. మేఘనను భర్తతో పాటు అత్తింటివారు వేధించచడం ప్రారంభించారు. 

ఈ వేధింపులను తట్టుకోలేక పోయిన ఆమె పుట్టింట్లోనే వుంటోంది. ఎప్పటికైనా భర్తలో మార్ప వచ్చి తనను కాపురానికి తీసుకెళతాడని అనుకుంటూ జీవితాన్ని సాగిస్తోంది. అయితే భర్త మాత్రం ఆమెను వదిలింంచుకోవాలని విడాకులు నోటీసులు పంపించాడు. దీన్ని తట్టుకోలేక పోయిన మేఘన శుక్రవారం భర్త వుంటున్న అపార్టు మెంట్ కు వెళ్లి  తొమ్మిదో అంతస్తు పైనుండి దూకి ఆత్మహత్య కు పాల్పడింది. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  
 
PREV
click me!

Recommended Stories

Talasani As Revanth Reddy | Telangana Mock Assembly | KTR | KCR | Asianet News Telugu
నాన్ స్టాప్ 40 నిముషాలు నవ్వులు | Telangana Mock Assembly | KTR | Revanth Reddy | Asianet Telugu