మరిదితో అక్రమ సంబంధం: భర్తను హత్య చేసిన మహిళ

Published : Jul 15, 2020, 06:53 AM ISTUpdated : Jul 15, 2020, 06:54 AM IST
మరిదితో అక్రమ సంబంధం: భర్తను హత్య చేసిన మహిళ

సారాంశం

తెలంగాణలోని వికారాబాదు సమీపంలోని అనంతగిరి అటవీ ప్రాంతంలో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి ఓ మహిళ తన భర్తను హత్య చేసిన ఉదంతం చోటు చేసుకుంది. వారం రోజుల తర్వాత ఆ విషయం బయటపడింది.

వికారాబాద్: తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఈ సంఘటన వికారాబాద్ పట్టణ శివారులోని అనంతగిరి అటవీ ప్రాంతంలో మంగళవారం వెలుగు చూసింది. 

రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరు గ్రామానికి చెందిన బైండ్ల చెన్నయ్య (38), శశికళ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ప్రవీణ్, పావని అనే కొడుకూకూతళ్లు ఉన్నారు. వరసకు మరిది అయిన రమేష్ తో ఆరేళ్లుగా శశికళ వివాహేతర సంబందం కొనసాగిస్తోంది. 

మద్యానికి బానిసైన చెన్నయ్య అదే విషయంపై తరుచుగా భార్యతో గొడవ పడుతుండేవాడు. దీంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి హత్యకు పథకరచన చేసింది. ఈ నెల 6వ తేదీన ముగ్గురు కలిసి బస్సులో పరిగికి వచ్చారు. అక్కడ మద్యం కొనుగోలు చేశారు. అనంతగిరి అటవీ ప్రాంతానికి వెళ్లి మద్యం సేవించారు. 

అనంతరం మద్యం మత్తులో ఉన్న చెన్నయ్యపై రాళ్లతో దాడి చేశారు. ఆ దాడిలో చెన్నయ్య మరణించాడు. మృతదేహంపై చెత్త, చెట్ల ఆకులు కప్పి శశికళ, రమేష్ వెళ్లిపోయారు. 

ఇదిలావుంటే, ఈ నెల 11వ తేదీన చెన్నయ్య తల్లి బాలమ్మ అనారోగ్యంతో మరణించింది. అంత్యక్రియలకు కుమారుడు కుమారుడు హాజరు కాకపోవడంతో, అతని భార్య ఏమీ తెలియనట్లు వ్యవహరించడంతో గ్రామస్థులకు అనుమాన వచ్చింది. దాంతో శశికళను ఈ నెల 13వ తేదీన నిలదీశారు. దానిపై ఈ నెల 14వ తేదీన పంచాయతీ పెట్టాలని అనుకున్నారు. 

పంచాయతీ పెడితే అసలు విషయం బయటపడుతుందనే భయంతో శశికళ 13వ తేదీ రాత్రి శరీరంపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. దాంతో ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ స్థితిలో శశికళతో సన్నిహితంగా ఉంటూ వచ్చిన రమేష్ ను నిలదీయగా అసలు విషయం బయటపడింది. 

ఆ తర్వాత రమేష్ చెప్పిన వివరాల ప్రకారం గ్రామస్థులు చెన్నయ్యను చంపిన ప్రదేశాన్ని పోలీసులకు చూపించారు. దాంతో నందిగామ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?