సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో బ్యాంకు ఉద్యోగి మునిస్వామి హత్య కేసులో కీలక విషయాలు వెలుగు చూశాయి. మునిస్వామిని ప్రియుడితో కలిసి భార్య హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. నిందితులను మంగళవారం నాడు అరెస్ట్ చేశారు.
నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో బ్యాంకు ఉద్యోగి మునిస్వామి హత్య కేసులో కీలక విషయాలు వెలుగు చూశాయి. మునిస్వామిని ప్రియుడితో కలిసి భార్య హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. నిందితులను మంగళవారం నాడు అరెస్ట్ చేశారు.
ఈ నెల 4వ తేదీన మునిస్వామి అనుమానాస్పదస్థితిలో మరణించిన విషయం తెలిసిందే. రెండు రోజులుగా ఈ కేసులో నిందితుల కోసం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. పోలీసులకు మునిస్వామి భార్య సంతుబాయిపై అనుమానం వచ్చింది.
undefined
also read:మేడ్చల్‌లో ప్రియుడితో కలిసి భర్త హత్య: రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే కుట్ర
పోలీసులు సంతుబాయిని ఈ విషయమై ప్రశ్నిస్తే ఆమె అసలు విషయం చెప్పింది. సంతుబాయి భర్త గొంతుకు చున్నీని బిగించింది. ప్రియుడు నజీర్ ఇనుప రాడ్ తో తలపై కొట్టాడు. దీంతో అతను అక్కడికక్కడే మరణించాడు.
మునిస్వామిని చంపితేనే తమ బంధానికి ఎలాంటి అడ్డు ఉండదని వీరిద్దరూ భావించారు. దీంతో భర్తను చంపాలని ప్రియుడు నజీర్ తో కలిసి ఆమె ప్లాన్ చేసింది. ఈ ప్లాన్ ను ఈ నెల 4వ తేదీన అమలు చేసింది. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టుగా పోలీసులు ప్రకటించారు.