కూతురు సాయంతో భర్త హత్య.. వారం రోజుల పాటు ఇంట్లోనే మృతదేహం.. నానా ప్రయత్నాలు చేసి.. చివరికి

By Rajesh KarampooriFirst Published Nov 8, 2023, 3:16 PM IST
Highlights

Sirisilla: భర్త వేధింపులను తాళలేక ఓ భార్య దారుణానికి పాల్పడింది. పక్కా ప్లాన్ ప్రకారం హతమొందించి తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఈ దారుణానికి కన్న కూతురు కూడా సాయం చేయడం మరో ట్వీస్ట్. అసలేం జరిగిందో తెలుసుకుందాం. 

Sirisilla: సిరిసిల్ల జిల్లాలో దారుణం ఘటన వెలుగులోకి వచ్చింది. మద్యానికి బానిసైన భర్త నిత్యం వేధింపులకు గురి చేయడం, ఇంట్లో వారిపై దుర్భాషలాడుతూ కొట్టడం. దీంతో  విసిగిపోయిన భార్య  తన భర్తను హతమార్చింది. శవాన్ని ఎవరి కంటబడకుండా దాదాపు వారం రోజులు ఇంట్లోనే దాచిపెట్టింది. క్రమంలో ఇంట్లోనే పూడ్చాలని, లేదంటే పెట్రోల్ పోసి తగలబెట్టే ప్రయత్నం చేసింది. కానీ, ఆ ప్రయత్నాలు విఫలం కావడంతో హడావుడిగా అంత్యక్రియలు నిర్వహించింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణానికి  కూతురు కూడా సాయం చేయడం మరో ట్వీస్ట్. 
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని శివనగర్ లో లేచర్ల ప్రకాశ్ రావు (44) తన భార్య, పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. అయితే.. గత కొంతకాలంగా మద్యానికి బానిస అయ్యారు. పైగా వేరే వివాహితతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో తరుచు మద్యాన్ని తాగి వచ్చి.. ఇంట్లో గొడవకు పాల్పడేవారు. తరుచు భార్య  స్వప్న, కుమార్తె ఉషశ్రీ లను కొట్టేవాడు. ప్రకాశ్ రావు చేష్టాలు రోజురోజుకు శ్రుతి మించిపోతున్నాయి. ఎలాగైనా అతన్ని చంపాలని భార్య ప్లాన్ చేసింది.  ఈ క్రమంలో పథకం ప్రకారం నవంబర్ 1న పుల్ గా తాగి వచ్చిన ప్రకాశ్ రావుపై  రాత్రి వేళ భార్య స్వప్న,  ఆమె కూతురు దారుణానికి పాల్పడ్డారు. ఒకరు కత్తితో దాడి చేయగా, మరోకరు ముఖంపై దిండు పెట్టి ఊపిరి ఆడకుండా చేశారు.  

ఈ విషయం బయటకు తెలియకుండా .. ఇంట్లోనే శవాన్నిముక్కలు ముక్కలు చేసి బయట పారివేయాలని ప్లాన్ చేశారు. కానీ, ఆ ప్లాన్ వర్కటవుట్ కాలేదు. ఆ తరువాత మృతదేహాన్ని ఇంట్లోనే పాతి పెట్టాలని భావించారు. అలా చేస్తే దుర్వాసన వస్తే బయట తెలుస్తుందని భావించారు. ఈ క్రమంలో పెట్రోల్ పోసి కాల్చివేసే ప్రయత్నం చేశారు. కానీ మృతదేహం పూర్తిగా కాలిపోలేదు. దీంతో స్వప్న నవంబర్ 3వ తేదీన తన తమ్ముడితో మరింత పెట్రోల్ తెప్పించి మృతదేహంపై పోసి నిప్పంటించారు.  అయితే, మంటలు పెద్ద ఎత్తున వ్యాప్తి చెందడంతో వెంటనే మంటలు ఆర్పివేశారు. ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా.. సెట్ కాలేదు.

చివరికి ఆకస్మిక మృతిగా చిత్రీకరించారు. బంధువులు, స్నేహితులు ఎవరూ రాకముందుకే హుటాహుటిన దహనం సంస్కారాలు నిర్వహించారు. బంధువులు, స్నేహితులు చివరి చూపుకుండానే దహన సంస్కారాలు పూర్తి చేయడంతో మృతిపై పలువురికి అనుమానం వ్యక్తమయ్యాయి. దీంతో ప్రకాశ్ రావు మృతిపై అనుమానం ఉందని బంధువులు సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.  నిందితులైన భార్య స్వప్న, కూతురు ఉషశ్రీని అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు. ఈ దారుణానికి సహకరించిన మరో ఇద్దరు కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  

click me!