భర్తను హత్య చేసిన కేసులో ఓ భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు వారాల క్రితం హైదరాబాద్ లోని జూకల్ లో వాచ్ మెన్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు.
హైదరాబాద్ : హైదరాబాద్ లోని జూకల్‌లో ఉన్న ఓ మామిడితోటలో వాచ్‌మెన్ గా పనిచేసే వ్యక్తి ఒకరు తన ఇంటిలో హత్యకు గురయ్యాడు. ఈ హత్య జరిగిన రెండు వారాల తర్వాత, హత్యానేరం కింద అతని భార్యను పోలీసులు అరెస్టు చేశారు.
మృతుడు వెంకటరాజుగా గుర్తించారు. అతను తన నివాసంలో హత్యకు గురయ్యాడని, కొందరు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి హత్య చేశారని ఆయన భార్య నాగమణి పోలీసులకు తెలిపినట్లు శంషాబాద్ పోలీసులు తెలిపారు. అయితే పోలీసులు ఆమె చెప్పింది నమ్మలేదు. ఆమెను విచారించగా, నాగమణి తానే హత్య చేసినట్లు అంగీకరించింది.
ఖమ్మంలో ఘోర రోడ్డుప్రమాదాలు.. వేర్వేరు ఘటనల్లో ఐదుగురు మృతి...
తన భర్త మద్యం తాగేవాడని, తనను రోజూ వేధించేవాడని పేర్కొంది. దీంతో తట్టుకోలేక అతడిని కత్తితో పొడిచానని.. అతను అక్కడికక్కడే చనిపోయాడని ఆమె తెలిపింది. దీంతో నాగమణిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించి, ఐపిసి సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేశారు.