బాన్సువాడ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం: రోగుల తరలింపు

By narsimha lodeFirst Published Jun 1, 2023, 10:52 AM IST
Highlights

నిజామాబాద్  జిిల్లాలోని  బాన్సువాడ  ఏరియా  ఆసుపత్రిలో  ఇవాళ  ఉదయం  అగ్ని ప్రమాదం  చోటు చేసుకుంది. 

నిజామాబాద్: ఉమ్మడి  నిజామాబాద్  జిల్లాలోని  బాన్సువాడ ఏరియా  ఆసుపత్రిలో  గురువారంనాడు  ఉదయం  అగ్ని ప్రమాదం  చోటు  చేసుకుంది.  ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్ లో  ఒక్కసారిగా  మంటలు చెలరేగాయి.  దీంతో  పెద్ద ఎత్తున పొగ  వ్యాపించింది.  . ఆసుపత్రిలో   మంటలను  ఫైరింజన్లు ఆర్పివేశాయి.  ఆపరేషన్ థియేటర్ లో  అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో రోగులు భయాందోళనలు వ్యక్తం  చేశారు.

 ఆపరేషన్ థియేటర్  ఉన్న ఫ్లోర్ లో  ఉన్న రోగులను  గ్రౌండ్ ఫ్లోర్ లోకి తరలించారు.రోగులను  గ్రౌండ్ ఫ్లోర్ కు తరలించారు.  అగ్ని ప్రమాదం  కారణంగా  ఆపరేషన్  థియేటర్  పూర్తిగా  దగ్ధమైంది.  ఆపరేషన్ థియేటర్ లో  షార్ట్ సర్క్యూట్  కారణంగా  అగ్ని ప్రమాదం  చోటు  చేసుకుందని  ప్రాథమికంగా నిర్ధారించారు.

దేశంలోని  పలు  ప్రాంతాల్లో  ఆసుపత్రుల్లో  అగ్ని ప్రమాదాలు  చోటు  చేసుకున్న ఘటనలు  గతంలో  చోటు  చేసుకున్నాయి. పంజాబ్  రాష్ట్రంలోని అమృత్ సర్ లో  గురునానక్ దేవ్  ఆసుపత్రిలో ఈ ఏడాది మే  4వ తేదీన  అగ్ని ప్రమాదం జరిగింది.  ఈ అగ్ని ప్రమాదం  గుర్తించిన  ఆసుపత్రి  సిబ్బంది  వెంటనే  ఫైరింజన్  సిబ్బందికి సమాచారం ఇచ్చారు.   ఫైరింజన్లు మంటలను  ఆర్పివేశాయి.  అదే సమయంలో  ఆసుపత్రిలోని  రోగులను  సురక్షిత  ప్రాంతాలకు  తరలించారు. 

ఆసుపత్రికి  సమీపంలోని  ట్రాన్స్ ఫార్మర్ లో  పేలుడు  కారణంగా  అగ్ని ప్రమాదం  జరిగినట్టుగా  అధికారులు గుర్తించారు.ఈ ఏడాది మే  20వ తేదీన  న్యూఢిల్లీలోని  ఈఎస్ఐ  ఆసుపత్రిలో  అగ్ని ప్రమాదం  చోటు  చేసుకుంది. ఏడు ఫైరింజన్లు మంటలను  ఆర్పివేశాయి. ఆసుపత్రిలోని  రోగులను  సురక్షిత  ప్రాంతాలకు  తరలించారు.

2021 మార్చి 25న  ముంబైలోని ప్రైవేట్  ఆసుపత్రిలో  అగ్ని ప్రమాదం  జరిగింది.  ఈ ప్రమాదంలో  పది మంది మృతి చెందారు.  ఆసుపత్రిలో  అగ్ని ప్రమాదం  కారణంగా  వెలువడిన పొగతో  ఎక్కువ మంది రోగులు  చనిపోయారని వైద్యులు గుర్తించారు. 

click me!