అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. భర్తను దారుణంగా చంపి, మృతదేహం భర్తది కాదంటూ బుకాయించి... ఓ భార్య ఘాతుకం.

By SumaBala Bukka  |  First Published Jun 18, 2022, 7:15 AM IST

వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ భార్య భర్తను అతి దారుణంగా హత్య చేయించింది. ఆ తరువాత మృతదేహం దొరకడంతో పోలీసులు ఆమె ఇంటికి వస్తే అది తన భర్తది కాదంటూ బుకాయించింది. కానీ..


హైదరాబాద్ :  అప్పు ఇచ్చిన వ్యక్తితో extramarital affair పెట్టుకొని భర్తను murder చేయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలను శుక్రవారం రాజేంద్రనగర్ ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ గంగాధర్ రెడ్డితో కలిసి శంషాబాద్ డిసిపి జగదీశ్వర్ రెడ్డి వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని Banaras ప్రాంతానికి చెందిన ప్రమోద్ కుమార్ అలియాస్ మహమ్మద్ ఇక్బాల్... 17 సంవత్సరాల క్రితం నగరానికి వచ్చాడు. గోల్కొండ ప్రాంతానికి చెందిన మెరాజ్ బేగం(36)ను పెళ్లి చేసుకొని ఇస్తాంలోకి మారాడు.  వీరికి ఇద్దరు మగపిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు. ఓ యూట్యూబ్ ఛానల్ లో విలేకరిగా పనిచేయడంతో పాటు మంత్రాలు వేస్తూ స్థానికంగా గుర్తింపు పొందాడు. 

అతడు మహ్మద్ లతీఫ్ (32) దగ్గర రెండు లక్షలు అప్పు తీసుకున్నాడు. అప్పటి నుంచి లతీఫ్ ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో మిరాజ్ బేగంతో లతీఫ్ కు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న ఇక్బాల్ ను అడ్డు తొలగించాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు.

Latest Videos

undefined

పక్కా ప్రణాళిక వేసుకుని…
ఈనెల 11న ఉదయం సిద్ధిపేటకు వెళ్తున్నట్టు 10వ  తేదీ రాత్రి భార్యకు చెప్పాడు ఇక్బాల్. వెంటనే ఆమె ప్రియుడు లతీఫ్ కు సమాచారం చేరవేసింది.  అదే ప్రాంతానికి చెందిన  మహమ్మద్ ఉస్మాన్ (21), షేక్ సోఫియాన్ (21)లను  ఇక్బాల్ హత్యకు సహకరించాలని చెరో పది వేలు ఇస్తానని చెప్పాడు. 11వ తేదీ ఉదయం నాలుగు గంటల సమయంలో ద్విచక్రవాహనంపై ఇక్బాల్ సిద్ధిపేటకు బయలుదేరాడు. ముగ్గురు అతడిని అనుసరించి  టోలి చౌకి దగ్గర అడ్డుకుని  కొట్టి,  కారులో ఎక్కించుకున్నారు. ఆ తర్వాత కారులోనే కత్తితో పొడిచి హత్య చేశారు. హత్య తర్వాత ఏదైనా చెరువులో మృతదేహాన్ని వేసి.. పైకి తేలకుండా జాగ్రత్త తీసుకోవాలని ముందుగానే పథకం వేసుకున్నారు.

మృతదేహాన్ని కారులో తెచ్చి సిమెంటు పలకలు కట్టి ఈసీ వాగులో పడేశారు. మూడు రోజుల తర్వాత మృతదేహం పైకి తేలింది. గుర్తింపు కార్డుతో పోలీసులు అతడిని ఇక్బాల్ గా గుర్తించి ఇంటికి వెళ్లారు. కానీ భార్య మెరాజ్ బేగం మృతదేహం తన భర్తది కాదంటూ  బుకాయించింది. అప్పటికే భర్త నాలుగు రోజులుగా కనిపించకపోయినా ఫిర్యాదు చేయకపోవడంతో ఆమెపై పోలీసులకు అనుమానం కలిగింది. ఆమె సెల్ఫోన్ ఆధారంగా దర్యాప్తు చేసి గుట్టు రట్టు చేశారు. హత్యకు పాల్పడిన నలుగురిని శుక్రవారం రిమాండ్కు తరలించినట్లు డీసీపీ తెలిపారు అభినందించారు. కేసును చేధించిన సీఐ కనకయ్య, ఎస్వోటీ సీఐ వెంకట్ రెడ్డిలను అభినందించారు. 

పెళ్లైన నెలరోజులకే భర్తను ఫ్యాన్ కు ఉరివేసి.. ఇంటికి తాళం వేసి.. ప్రియుడితో కలిసి జంప్...

కాగా, పెళ్లి చేసుకోవడానికి అంగీకరించడం లేదని ఓ వివాహిత కుమారుడిని కిడ్నాప్ చేసిన యువకుడిమీద జూబ్లీహిల్స్ పోలీసులు కిడ్నాప్ కేసు  నమోదు చేసి చిన్నారి కోసం గాలింపు చేపట్టారు. పోలీసులు తెలిపిన మేరకు.. బబ్బుగూడలో నివసించే షేక్ తబస్సుమ్ (24) భర్తతో విడిపోయి ఈవెంట్ ఆర్గనైజనర్ గా రహ్మత్ నగర్ లో పనిచేస్తుంది. ఈమెకు ఇద్దరు కుమారులు. తన ఇంటి సమీపంలోనే నివసించే శంకర్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త గత మూడు నెలలుగా సహజీవనానికి దారి తీసింది. ఇద్దరూ బబ్బుగూడలో సహజీవనం చేస్తున్నారు. ఈ నెల 14వ తేదీన పెళ్లి చేసుకోవాలంటూ శంకర్ ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చాడు. 

ఇందుకు ఆమె అంగీకరించలేదు. దొంగతనాలు చేస్తూ పోలీసులకు కూడా పట్టుబడ్డాట్లు శంకర మీద అభియోగాలు ఉండటంతో పెళ్లికి నిరాకరించింది. కక్ష పెంచుకున్న శంకర్ బాధితురాలు రహ్మత్ నగర్ లో ఓ కార్యక్రమంలో ఉండగా తనతో పాటు వచ్చిన రెండేళ్ల కుమారుడిని ఎత్తికెళ్లినట్లు ఆమె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ పోలీసులు శంకర్ పై కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. నాందేడ్ లో ఉన్నట్లుగా ఫోన్ కాల్ డేటా ఆధారంగా గుర్తించారు. నాందేడ్ కు ఒక పోలీస్ బృందం గురువారం వెళ్లింది. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

click me!