వీరిద్దరూ కూలిపని చేసుకుంటూ జీవనం సాగించేవారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఇద్దరు కూతుళ్లను చదివించి పెళ్లిళ్లు చేశారు. దీంతో వీరు అప్పులపాలయ్యారు. వీటిని తీర్చేందుకు బాలాజీ దుబాయ్ వెళ్లాడు.
సూర్యాపేట : వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్న భర్తను ఓ భార్య దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మేళ్ల చెర్వు మండలం కప్పలకుంట తండాలో శనివారం రాత్రి జరిగింది. తండాకు చెందిన భూక్య బాలాజీ (40)కి బుజ్జితో 20 యేళ్ల క్రితం వివాహం అయ్యింది.
వీరిద్దరూ కూలిపని చేసుకుంటూ జీవనం సాగించేవారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఇద్దరు కూతుళ్లను చదివించి పెళ్లిళ్లు చేశారు. దీంతో వీరు అప్పులపాలయ్యారు. వీటిని తీర్చేందుకు బాలాజీ దుబాయ్ వెళ్లాడు.
నాలుగేళ్లు అక్కడే కూలీపని చేసి ఇంటికి డబ్బులు పంపించేవాడు. దీంతో అప్పుడు తీర్చాడు. అయితే భర్త లేని ఈ సమయంలోఇదే తండాకు చెందిన రాముతో బుజ్జికి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా దుబాయ్ లో ఉన్న భర్తకు తెలిసింది. దీంతో భర్త ఆమెను Illegal affairగురించి నిలదీశాడు.
నిజామాబాద్‌లో కిడ్నాపైన చిన్నారి: మూడు రోజుల తర్వాత మహారాష్ట్రలో చిక్కిందిలా...
అప్పటికి ఏదో చెప్పి తప్పించుకున్న బుజ్జి భర్త బతికుంటే ఎప్పటికైనా ప్రమాదమే అనుకుంది. తన extramarital relationshipకి అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకునేందుకు రాముతో కలిసి పథకం వేసింది. శనివారం రాత్రి భర్త మద్యం మైకంలో ఉండగా గొడవపడింది. కోపంతో బాలాజీ తలను గోడకేసి గట్టిగా బాదడంతో తీవ్రగాయాలయ్యాయి. అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన మృతుడి అన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.