నిజామాబాద్‌లో కిడ్నాపైన చిన్నారి: మూడు రోజుల తర్వాత మహారాష్ట్రలో చిక్కిందిలా...

By narsimha lode  |  First Published Oct 10, 2021, 5:14 PM IST


నిజామాబాద్ జిల్లాలోని కిడ్నాప్‌నకు గురైన మూడేళ్ల చిన్నారి ఆన్‌కియా హనీ క్షేమంగా ఉందని పోలీసులు గుర్తించారు.మహారాష్ట్రలోని నర్సీ ప్రాంతంలో కిడ్నాపర్లు బాలికను వదిలివెళ్లారు. బాలికను నిజామాబాద్ కు తీసుకొస్తున్నారు పోలీసులు



 నిజామాబాద్: రెండు రోజుల క్రితం కిడ్నాప్‌నకు గురైన మూడేళ్ల చిన్నారి క్షేమంగా ఉందని నిజామాబాద్ పోలీసులు ప్రకటించారు.మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా నర్సీలో కిడ్నాపర్‌ను  పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా పాప తల్లిదండ్రులతో వీడియో కాల్ ద్వారా మాట్లాడించారు. బాలికను nizambadతీసుకు వస్తున్నారు.

also read:టీచరే కీచకుడయ్యాడు.. మైనర్ ను కిడ్నాప్ చేసి, ఇద్దరు పిల్లలకు తండ్రయ్యాడు.. ఆరేళ్ళ తరవాత..

Latest Videos

jagitial జిల్లా మెట్‌పల్లికి చెందిన నూరేన్ మూడేళ్ల కూతురు ఆన్‌కియా హనీతో పాటు తన తల్లిని తీసుకొని నిజామాబాద్ కు బట్టలు కొనుగోలు చేసేందుకు శుక్రవారం నాడు వచ్చింది. బట్టలు తీసుకొని బిల్లు చెల్లించే సమయంలో మూడేళ్ల ఆన్‌కియా హనీ అదృశ్యమైంది. షాపింగ్ మాల్‌తో పాటు సమీపంలోని అన్ని  ప్రాంతాల్లో వెతికారు. పాప ఆచూకీ లభ్యం కాలేదు. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

షాపింగ్ మాల్ సమీపంలోని cctvv దృశ్యాలను పరిశీలించిన పోలీసులు బుర్ఖా ధరించిన మహిళ చిన్నారిని తీసుకెళ్లినట్టుగా గుర్తించారు. దీంతో పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని చెక్ చేశారు. కానీ ఆదివారం నాడు ఉదయం maharashtraనర్సీ ప్రాంతంలో కిడ్నాపర్లు బాలికను వదిలివెళ్లారు.

click me!