భార్యాభర్తల గొడవ.. కళ్లలో కారం చల్లి, కత్తులతో నరికి.. ఒకరి హత్య, ముగ్గురికి గాయాలు...

By SumaBala BukkaFirst Published Dec 22, 2021, 7:55 AM IST
Highlights

శివ నారాయణ హైదరాబాద్లో ప్రైవేటు ఉద్యోగం చేసేవాడు. కరోనా కారణంగా స్వగ్రామానికి తిరిగివచ్చి.. వారికి ఉన్న 10 ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తున్నాడు. వివాహమైన ఏడాది నుంచే భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అప్పట్లో గ్రామ పెద్దలు వీరిద్దరికీ సర్థిచెప్పారు. ఈ క్రమంలో సోమవారం ఇద్దరి మధ్య గొడవ జరగగా.. ఈ విషయాన్ని మంగళవారం ఉదయం శ్యామల తల్లిగారింటికి ఫోన్ చేసి చెప్పింది. 

నిడమనూరు :  wife and husband గొడవ రెండు కుటుంబాల మధ్యకత్తులు దూసుకునే వరకు వెళ్ళింది.  ఈ దాడి  ఓ మహిళ ప్రాణాన్ని బలి తీసుకోగా.. ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యేలా చేసింది. ఈ ఘటన Nalgonda District నిడమనూరు మండలం బొక్కమంతలపహాడ్ లో మంగళవారం జరిగింది.  పోలీసులు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..  బొక్కమంతలపహాడ్ కు చెందిన కమతం బిక్షమయ్య, అచ్చమ్మ దంపతుల కుమారుడు శివ నారాయణకు అదే గ్రామానికి చెందిన జిల్లపల్లి సూర్యనారాయణ, యశోద దంపతుల కుమార్తె శ్యామలతో ఐదేళ్ల కిందట వివాహమయ్యింది.

వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. శివ నారాయణ హైదరాబాద్లో ప్రైవేటు ఉద్యోగం చేసేవాడు. కరోనా కారణంగా స్వగ్రామానికి తిరిగివచ్చి.. వారికి ఉన్న 10 ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తున్నాడు. వివాహమైన ఏడాది నుంచే భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అప్పట్లో గ్రామ పెద్దలు వీరిద్దరికీ సర్థిచెప్పారు. ఈ క్రమంలో సోమవారం ఇద్దరి మధ్య గొడవ జరగగా.. ఈ విషయాన్ని మంగళవారం ఉదయం శ్యామల తల్లిగారింటికి ఫోన్ చేసి చెప్పింది. 

తరచూ conflicts నేపథ్యంలో తీవ్ర ఆగ్రహానికి లోనైన శ్యామల తండ్రి సూర్య నారాయణ, తల్లి యశోద, అన్న శివ ఉదయం ఎనిమిదిన్నర గంటల సమయంలో శివ నారాయణ ఇంటికి వెళ్లారు. వారి వెంట తెచ్చుకున్న red chilli powderని ఇంట్లో ఉన్న శివ నారాయణ, అతని తండ్రి బిక్షమయ్య, తల్లి అచ్చమ్మ, అమ్మమ్మ నారమ్మ కళ్లల్లో కొట్టారు. knivesతో దాడి చేసి పరారయ్యారు.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అచ్చమ్మ (60) అక్కడికక్కడే చనిపోయింది. వీరి కేకలతో అప్రమత్తమైన స్తానికులు పోలీసులకు సమాచారం అందించారు.  తీవ్రంగా  గాయపడిన ముగ్గురిని మిర్యాలగూడ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు, క్లూస్ టీం సభ్యులు సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. మిర్యాలగూడ ప్రథమశ్రేణి కోర్టు న్యాయమూర్తి మాధవి క్షతగాత్రుల వాంగ్మూలం నమోదు చేశారు. శివ నారాయణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు నాగార్జునసాగర్ సీఐ గౌరినాయుడు తెలిపారు. నిందితులు సూర్యనారాయణ, యశోద, శివ నిడమనూరు ఠాణాలో లొంగిపోయినట్లు సమాచారం.

పొలం తీసుకుని పరిహారం ఇవ్వలేదు.. రైతు ఆత్మహత్యాయత్నం

ఇదిలా ఉండగా, కూతురు తనకిష్టం లేని పెళ్లి చేసుకుందని ఓ తండ్రి మైసూరులో దారుణంగా వ్యవహరించాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు తమను కాదని loverతో వెళ్లిపోవడంతో తట్టుకోలేని తండ్రి రోడ్డు మీదే ఆమెపై దాడి చేశాడు. కుమార్తె మెడలో ఉన్న తాళిబొటటును తెంచేసి.. జుట్టు పట్టుకుని తండ్రి ఈడ్చుకెడుతుండడం చూసిన జనం.. అడ్డుకున్నారు. వివరాల్లోకి వెడితే.. నంజనగూడు తాలూకాలని హరతళె గ్రామానికి చెందిన చైతర్ర, హల్శెర గ్రామానికి చెందిన మహేంద్ర సుమారు ఏడాదిన్నర కాలంగా ప్రేమించుకుంటున్నారు. 

పెళ్లి చేసుకుందామనుకుని విషయాన్ని ఇద్దరి ఇళ్లల్లోనూ చెప్పారు. అయితే ఈ పెళ్లికి యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దాంతో ప్రేమజంట ఈ నెల 8వ తేదీన ఒక గుడిలో మూడు ముళ్లు వేసుకుని, ఆ పెళ్లిని రిజిస్టర్ చేసుకోవాలని సోమవారం సాయంత్రం 4 గంటలప్పుడు నంజనగూడుకు రాగా, చైత్ర తండ్రి బసవరాజు నాయక్ అడ్డుకున్నాడు. కుమార్తె మెడలోని తాళిని తెంచేశాడు. ఆమె జుట్టు పట్టుకుని లాక్కెళ్లసాగాడు.

ఈ హఠాత్ పరిణామానికి చైత్ర, మహేంద్ర ఇద్దరూ షాక్ అయ్యారు. తండ్రి లాక్కెడుతుండడంతో చైత్ర గట్టిగా కాపాడండి.. కాపాడండి అంటూ అరవసాగింది. ఈ అరుపులు విన్న స్థానికులు తండ్రిని అడ్డుకున్నారు. వెంటనే తండ్రి నుంచి విడిపించుకుని భర్తను చేరుకుంది. స్థానికుల సాయంతో ఆమె నంజనగూడు పోలీస్ స్టేషన్ కు వెళ్లి తండ్రి మీద ఫిర్యాదు చేసింది. తండ్రి నుంచి తమకు భద్రత కల్పించాలని కోరింది. ఈ తతంగమంతా చూసి అందరూ ఆశ్చర్యపోయారు. 

click me!