ములుగు జిల్లాలో ఇద్దరు దంపతులు గంట వ్యవధిలోనే మరణించారు. భార్య ఫిట్స్‌తో నేలపై పడి మరణించారు. ఆమె మరణంతో భర్త తల్లడిల్లాడు. గంట వ్యవధిలోనే ఆయనకు గుండె పోటు వచ్చింది. బంధువులు వెంటనే ఆయనను హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. కానీ, అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు చెప్పారు.
హైదరాబాద్: మూడు ముళ్లు.. ఏడు అడుగుల బంధంతో ఒక్కటైన ఆ దంపతులు(Couple) జీవితాంతం ఒకరి కోసం ఒకరు జీవించారు. చావులోనూ ఒకటిగానే లోకం విడిచి వెళ్లిపోయారు. ఫిట్స్‌తో భార్య(Wife) మరణించగానే.. గంట వ్యవధిలోనే హృదయం బరువెక్కి హార్ట్ ఎటాక్(Heart Attack)తో భర్త(Husband) కూడా చనిపోయారు. ఈ ఘటన ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది.
మాసపత్రి రాజయ్య(75), స్వరూప(70) దంపతులు. మాసపత్రి రాజయ్య సింగరేణి కార్మికుడిగా పని చేశారు. ఇప్పుడు రిటైర్‌మెంట్‌లో ఉన్నారు. పదవీ విరమణ తర్వాత ఆయన వెంకటాపూర్ మండల కేంద్రంలోని తాళ్లపాడు సెంటర్‌లో నివసిస్తున్నాడు. తాళ్లపాడు సెంటర్‌లోనే ఇల్లు కట్టుకుని భార్యతో కలిసి ఉన్నాడు. అయితే, శుక్రవారం ఉదయం భార్య స్వరూపకు ఫిట్స్ వచ్చింది. ఈ ఫిట్స్‌తో ఆమె కింద పడిపోయింది. అనంతరం కొద్ది సేపటికే మృతి చెందింది. భార్య మరణించడాన్ని భర్త మాసపత్రి రాజయ్య విలవిల్లాడాడు. భార్య మరణాన్ని తట్టుకోలేకపోయాడు. గంట వ్యవధిలోనే ఆయనకూ గుండె పోటు వచ్చింది. బంధువులు వెంటనే ఆయనను ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కానీ, అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు చెప్పారు. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. వారు వేర్వేరు చోట్లల్లో వ్యాపారాలు చేసుకుంటున్నారు.
Also Read: ఉద్యోగం తెచ్చుకొమ్మంటే ఉరేసుకుని చనిపోయారు... ప్రేమజంట దారుణం...
ఈ నెల 2వ తేదీన ఇద్దరు వయోధికులు ఒక్కటయ్యారు. వారిద్దరి వయస్సూ 65 సంవత్సరాలు. ఒకరంటే మరొకరికి గాఢమైన love. కానీ అనుకోని పరిస్థితుల్లో ఆమెకు యుక్త వయస్సులో మరొకరితో marriage అయిపోయింది. ప్రేయసి దక్కలేదన్న ఆవేదనతో అతడు ఒంటరిగానే మిగిలిపోయాడు తప్ప వేరెవ్వరినీ తన జీవితంలోకి రానీయలేదు. కొంత కాలానికి ఆమె భర్త చనిపోయాడు. ఆమెకు పిల్లలు లేరు. అప్పటినుంచి ఇద్దరూ తమ old memoriesని నెమరువేసుకుంటూ వేర్వేరుగానే ఉంటూ వచ్చారు. చివరకు సమాజాన్ని, కట్టుబాట్లు కాదని 65 యేళ్ల వయస్సులో పెళ్లి చేసుకున్నారు. గురువారం కర్ణాటకలోని మండ్య జిల్లా మేలుకోటెలో ఈ పెళ్లి జరిగింది.
మేలుకోటె చెలువనారాయణుడి ఆలయానికి ఎదురుగా ఉన్న ఆశ్రమంలో మైసూరాలోని హెబ్బాళ ప్రాంతానికి చెందిన చిక్కణ్ణ, అదే ప్రాంతానికి చెందిన జయమ్మ (ఇద్దరికీ 65యేళ్లే) శాస్త్రోక్తంగా పెళ్ల చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అనంతరం సంప్రదాయం ప్రకారం ఆమెకు అరుంధతీ నక్షత్రాన్ని కూడా చూపించారు. ఇప్పుడీ లేటు వయసు పెళ్లి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.