నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం, నూనావత్ తండాలో దారుణం జరిగింది. ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాల కారణంగా ఇద్దరు కొడుకులను కొత్త బట్టలు కొనిస్తానని బయటకు తీసుకెళ్లి తండ్రి చంపేశాడు. ఆ తర్వాత ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. కొత్త బట్టల కోసం బయటకు వెళ్లిన తన కుటుంబం మళ్లీ తిరిగి రాలేదని ఆయన భార్య ఆందోళన చెందింది. చుట్టు పక్కాల వెతికారు. కానీ, మరుసటి రోజు ఉదయం పిల్లల డెడ్ బాడీలు, ఉరితాడుకు కిషన్ మృతదేహం రైతులకు కనిపించింది.
హైదరాబాద్: నల్లగొండ(Nalgonda) జిల్లాలో దారుణం జరిగింది. ఆర్థిక సమస్యలు ఒకవైపు, కుటుంబ కలహాలు మరోవైపు వెరసి ఆయన భవిష్యత్‌పై ఆశలు వదులుకున్నాడు. జీవించే వ్యర్థం అని భావించాడు. అందుకే తన ఇద్దరు చిన్నారులను చంపేసి.. తానూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పిల్లలకు కూల్ డ్రింక్‌లో విషం కలిపి ఇచ్చి చంపినట్టు(Killed) సమాచారం. ఈ ఘటన నల్లగొండ జిల్లా దామరచర్లలలో చోటుచేసుకుంది. నూనావంత్ తండాలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఇద్దరు కొడుకులు, భర్త చనిపోవడం(Suicide)తో భార్య శోకసంద్రంలో మునిగిపోయింది.
నూనావంత్ తండాకు చెందిన గేరు కిషన్(35), భూలక్ష్మి దంపతులు. వీరికి ఇద్దరు కొడుకులు హర్షవర్దన్(8), అఖిల్(6)లు ఉన్నారు. తండాలో కిషన్‌కు ఒక ఎకరం పొలం ఉన్నది. ఇది సాగు చేసి కుటుంబ బాధ్యతలు నెరవేర్చేవాడు. ఆర్థిక సమస్యల కారణంగా దంపతుల మధ్య గొడవలు జరిగేవి. బతుకు దెరువు కోసం మూడేళ్ల క్రితం భార్యాపిల్లలతో కలిసి కిషన్ మిర్యాలగూడకు వెళ్లాడు. అక్కేడ ఆటో నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకొచ్చాడు. ఇటీవలే వారు మళ్లీ స్వగ్రామానికి తిరిగి వచ్చారు. స్వగ్రామంలోనే పిల్లలను బడికి పంపారు. గురువారం పిల్లలు బడి నుంచి ఇంటికి రాగానే కిషన్ ఆటో స్టార్ట్ చేశాడు. కొత్త బట్టలు కొనిస్తానని, మిర్యాలగూడకు వెళ్దామని పిల్లలతో చెప్పాడు. కొత్త బట్టలు అనగానే పిల్లలు ఎగిరి గంతేశారు. రెడీ అయి ఆటో ఎక్కారు.
undefined
Also Read: హైదరాబాద్ : బీటెక్ విద్యార్ధి ఆత్మహత్య.. సైలెంట్‌గా మృతదేహం ఆసుపత్రికి తరలింపు, ఉద్రిక్తత
మిర్యాలగూడకు వెళ్తామని ఇంటి నుంచి బయల్దేరి వెళ్లిన పిల్లలు, భర్త రాత్రి అయినా తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన పెరిగింది. రాత్రి వరకూ ఎదురుచూసి వారు రాకపోయే సరికి ఇరుగు పొరుగులో రాత్రిపూట వారి జాడ కోసం వెతికారు. కానీ, ఫలితం లేకపోయింది. అయితే, శుక్రవారం ఉదయం పొలాలకు వెళ్లిన స్థానికు రైతులకు అసలు విషయం తెలిసి వచ్చింది. చిన్నారులు ఇద్దరూ విగత జీవులై పడి ఉండగా, కిషన్ బాడీ ఉరితాడుకు వేళాడుతూ కనిపించింది. దీంతో రైతులు వెంటనే వారి కుటుంబ సభ్యులకు, పోలీసులకు విషయాన్ని చేరవేసింది.
ఇద్దరు పిల్లలకు కూల్ డ్రింక్‌లో విషం కలిపి ఇచ్చి చంపేసినట్టు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాతే తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు పేర్కొన్నారు. కాగా, ఘటనా స్థలికి వచ్చిన కిషన్ భార్య, తల్లిదండ్రులు ఆవేదనతో గుండలవిసేలా రోధించారు. పోస్టుమార్టం కోసం డెడ్ బాడీలను ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. తన కొడుకు మరణానికి ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలే కారణమని కిషన్ తల్లి పోలీసులకు వివరించింది.
Also Read: Inter students suicides: తల్లిదండ్రులకు కడుపుకోత, బోర్డుపై భగ్గు
హైదరాబాద్ (hyderabad) బాచుపల్లిలోని (bachupally) వీఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల (vnr engineering college) వద్ద ఇటీవలే ఉద్రిక్తత చోటు చేసుకుంది. 13వ అంతస్తు నుంచి దూకి బీటెక్ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. అలర్ట్ అయిన కాలేజ్ సిబ్బంది గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి (gandhi hospital) తరలించారు. విషయం తెలుసుకున్న ఏబీవీపీ కార్యకర్తలు (abvp activists) .. కాలేజీ దగ్గర ఆందోళనకు దిగారు. క్యాంపస్‌లోకి చొరబడి ఫర్నీచర్ ధ్వంసం చేశారు. పరిస్ధితి ఉద్రిక్తతకు దారి తీయడంతో ఏబీవీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జీ చేసి చెదరగొట్టారు.