మద్యం మత్తులో ఇంజనీరింగ్ విద్యార్థుల డ్రైవింగ్.. బైక్‌తో యాక్సిడెంట్.. మహిళ దుర్మరణం

By Mahesh KFirst Published Dec 25, 2021, 4:46 AM IST
Highlights

మద్యం మత్తులో ఉన్న ఇంజనీరింగ్ విద్యార్థులు కారును వేగంగా పోనిచ్చారు. అదే సమయంలో ఘట్‌కేసర్ నుంచి ఎదులాబాద్‌కు బైక్ పై వెళ్తున్న దంపతులను ఆ కారు ఢీ కొట్టింది. కారు అధిక వేగంతో ఉండటంతో వివాహిత అక్కడికక్కడే దుర్మరణం చెందింది. ఆమె భర్త తీవ్ర గాయాలపాలు కావడంతో స్థానికులు ఆయనను హాస్పిటల్‌కు తరలించారు.

హైదరాబాద్: మద్యం(Alcohol) సేవించి వాహనాలు నడపరాదని ప్రభుత్వాలు తరుచూ హెచ్చరిస్తున్నా.. తనిఖీలు చేస్తున్నా ఈ తరహా ఘటనలు ఆగేలా లేవు. మత్తులో డ్రైవింగ్ చేయడంతో వారి ప్రాణాలకే కాదు.. ఎదుటి వారి ప్రాణాలూ పోయే ముప్పు ఉంటుంది. ఇది తెలిసి కూడా నివారించగలిగే ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా, ఘట్‌కేసర్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. వారంతా ఇంజనీరింగ్ విద్యార్థులు(Engineering Students).. కాలేజీ ముగిసిన తర్వాత లిక్కర్ తాగారు. అంతటితో ఊరుకోకుండా మద్యం మత్తులోనే కారు నడిపారు. మద్యం మత్తులో కారు నడపడంతో రోడ్డుపై ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం(Accident)లో బైక్‌పై  భర్తతో కలిసి వెళ్తున్న వివాహిత అక్కడికక్కడే మరణించారు. 

ఈ ఘటన మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. బత్తుల హనుమాన్ దాస్ గౌడ్, నిరంజని దంపతులు. ఎదులాబాద్ వాస్తవ్యులు. వీరు ఘట్‌కేసర్ నుంచి ఎదులాబాద్‌కు బైక్ పై వెళ్తున్నారు. అదే సమయంలో మత్తులో స్టూడెండ్లు డ్రైవింగ్ చేస్తున్న కారు రోడ్డెక్కింది. ఆ కారు అతి వేగంగా వచ్చి హనుమాన్ దాస్ గౌడ్, నిరంజనలు వెళ్తున్న బైక్‌ను ఢీ కొట్టింది. కారు అత్యధిక వేగంతో వెళ్తుండటంతో నిరంజన అక్కడికక్కడే మరణించింది. ఆమె భర్త హనుమాన్ దాస్ గౌడ్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి హనుమాన్ దాస్ గౌడ్‌ను ఆస్పత్రికి తరలించారు. అలాగే, ప్రమాదానికి కారణమైన కారు, నిందిత విద్యార్థులను స్థానికులే పట్టుకున్నారు. వారిని పోలీసు స్టేషన్‌లో అప్పగించారు. కాగా, ఇద్దరు విద్యార్థులు మాత్రం అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన చోటుచేసుకోగానే... బాధితుల పక్షాన నిలుస్తూ గ్రామ ప్రజలు కదలి వచ్చారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వారికి నచ్చజెప్పించారు. ఆ తర్వాత వారు శాంతించారు.

Also Read: Sangareddy Accident: కలల బైక్ పై స్వగ్రామానికి వెళుతుండగా ఘోరం... యువకుడు మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం జమ్మాపురంలో ఈ దుర్ఘటన జరిగింది. జమ్మాపురం స్టేజీ వద్ద ద్విచక్ర వాహనదారులు అదుపు తప్పి హఠాత్తుగా రోడ్డుపై పడిపోయాడు. అదే సమయంలో నవతా ట్రాన్స్‌పోర్ట్‌కు చెందిన లారీ వెనుక నుంచి వస్తున్నది. బైక్ నడుపుతున్న డ్రైవర్ ఒక్కసారిగా కిందపడిపోవడాన్ని లారీ డ్రైవర్ చూశాడు. అంతే వేగంగా బ్రేకులు వేశాడు. లారీ కంట్రోల్‌లోకి వచ్చింది. బైక్ పైకి వెళ్లేలోపలే అది ఆగిపోయింది. కానీ, ఆ నవతా లారీ  వెనుకే ఓ బస్సు కూడా వస్తున్నది. ఆ బస్సు డ్రైవర్‌కు లారీ ముందు జరుగుతున్న పరిణామం తెలియదు. ఒక్కసారిగా లారీ సడన్ బ్రేక్ వేయడంతో దాని వెనుకే వస్తున్న బస్సు లారీని ఢీకొంది. లారీ వెనుకను బస్సు ఢీ కొట్టింది.

Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన వ్యాన్.. ఒకరు దుర్మరణం.. తొమ్మిది మందికి గాయాలు

ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 65 మంది ప్రయాణికులు ఉన్నారు. లారీని ఢీ కొన్నందున అందులో 15 మందికి గాయాలయ్యాయి. మహిళా కండక్టర్‌కు ఏకంగా చేయి విరిగింది. క్షతగాత్రులను వెంటనే బీబీనగర్ ఎయిమ్స్, జిల్లా కేంద్ర ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు.

click me!