పెరేడ్ గ్రౌండ్ కి ఈ వాకర్లు రారా... ?

Published : May 21, 2017, 06:52 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
పెరేడ్ గ్రౌండ్ కి ఈ వాకర్లు రారా... ?

సారాంశం

ధర్నా చౌక్ లో వాకర్ల కు మద్దతుగా ప్రజాసంఘాల తలలు పగలగొట్టిన పోలీసులు ఇప్పుడు ఏం చేస్తున్నారు.  

అర్రెర్రె... ఆ పోలీసులు ఎక్కడ.. ?  ఆ ప్ల కార్డులు ఏవీ... ? ఆ సీఐ శ్రీదేవీ గారు ఎక్కడున్నారు.. ? స్థానిక టీఆర్ఎస్ నేతలు ఏరీ..?  ధర్నా చౌక్ నుంచి త్వరగా వచ్చేయండి.. ఇప్పుడు సమస్య పెరేడ్ గ్రౌండ్ కు వచ్చింది. ఇక్కడ కూడా వాకింగ్ చేయలేని పరిస్థితి ఎదురవుతోంది.

 

అవును ధర్నా చౌక్ లో వాకర్లకు ఎదురైన సమస్యే ఇప్పుడు పెరేడ్ గ్రౌండ్ లో వాకర్లకు ఎదురవుతోంది.

 

ఎందుకంటే ఇప్పుడున్న విశాలమైన పెరేడ్ గ్రౌండ్ లో త్వరలో కేసీఆర్ సర్కారు పక్కా వాస్తుతో సెక్రటేరియట్ నిర్మించనుందట.

 

మరీ, ఇన్నాళ్లు అక్కడ వాకింగ్లకు వెళ్లిన వారి పరిస్థితి ఏంటీ.. ?

 

ఇప్పుడు అక్కడి వాకర్లు ఎక్కడికి వెళ్లాలి... ?

 

ధర్నా చౌక్ లో వాకర్ల కు మద్దతుగా ప్రజాసంఘాల తలలు పగలగొట్టిన పోలీసులు ఇప్పుడు ఏం చేస్తున్నారు.

 

స్థానికంగా ఉన్న గులాబీ నేతలు ఏమైపోయినట్లు... ?

 

సర్కారు తన ఖజానా నుంచి వారికి బిర్యానీ ప్యాకెట్లు ఎందుకు పంచడం లేదు...?

 

ధర్నాచౌక్ వాకర్లకు ఒక న్యాయం.. పెరేడ్ గ్రౌండ్ వాకర్లకు ఒక న్యాయమా...?

 

ఇద్దరికీ సమన్యాయం చేయాల్సిందే...

 

ఇక్కడా పోలీసులు మఫ్టీలో రావాల్సిందే.... వాకర్లకు రక్షణగా నిలవాల్సిందే... ఫ్ల కార్డులతో

ఆందోళన చేయాల్సిందే. ఎక్కడెక్కడో ఉన్న స్థానిక టీఆర్ఎస్ నాయకులు కూడా వచ్చితీరాల్సిందే.

 

PREV
click me!

Recommended Stories

Revanth Reddy: లాగులో తొండలు విడిచి కొడతా కేటీఆర్ పై రేవంత్ రెడ్డి సెటైర్లు | Asianet News Telugu
Bank Holidays : జనవరి 2026 లో ఏకంగా 16 రోజుల బ్యాంక్ హాలిడేస్... ఏరోజు, ఎందుకు సెలవు?