అసెంబ్లీలో గద్దర్ కు కేసీఆర్ ఎందుకు నివాళులర్పించలేదు: రేవంత్ రెడ్డి ఫైర్

Published : Aug 08, 2023, 04:43 PM IST
అసెంబ్లీలో  గద్దర్ కు కేసీఆర్ ఎందుకు నివాళులర్పించలేదు: రేవంత్ రెడ్డి ఫైర్

సారాంశం

తెలంగాణ అసెంబ్లీలో  గద్దర్ కు నివాళులర్పించకపోవడాన్ని సీఎం  కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు.

న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీలో  గద్దర్ కు తెలంగాణ సీఎం కేసీఆర్  నివాళులర్పించకపోవడాన్ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తప్పుబట్టారు.మంగళవారంనాడు  టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి  న్యూఢిల్లీలో  మీడియాతో మాట్లాడారు.  జీవితాంతం ప్రజల కోసం పోరాటం గద్దర్ పోరాటం  చేశారన్నారు అలాంటి గద్దర్  కు తెలంగాణపై తెలంగాణ అసెంబ్లీలో  కేసీఆర్ చర్చ  పెట్టలేదన్నారు. .  తెలంగాణ ఉద్యమంలో కూడ గద్దర్ కీలకంగా వ్యవహరించిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు  చేశారు.ప్రజా సమస్యలపై  కేసీఆర్ అసెంబ్లీలో చర్చించలేదన్నారు. అసెంబ్లీలో  సమస్యలపై  మాట్లాడకుండా  తన చుట్టే సభను తిప్పారన్నారు.  కేటీఆర్ తన నోటికి ఎంతవస్తే అంత మాట్లాడారన్నారు. అమెరికాలో  ఉచిత విద్యుత్ గురించి తాను  చేసిన వ్యాఖ్యలపై  అసెంబ్లీలో  అధికార పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిందని ఆయన విమర్శలు చేశారు. 

కాంగ్రెస్ పార్టీలో వేటు పడిన తర్వాత  చౌరస్తాలో నిలబడిన కేసీఆర్ కు  ఆనాడు  టీడీపీనే దిక్కైందని  రేవంత్ రెడ్డి  ఎద్దేవా చేశారు. ఇండిపెండెంట్ గా  ఎమ్మెల్సీగా విజయం  సాధించిన తర్వాత తాను  టీడీపీలో చేరిన విషయాన్ని  రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. చంద్రబాబుకు సహచరుడిగానే తాను ఆ పార్టీలో కొనసాగినట్టుగా  రేవంత్ రెడ్డి  చెప్పారు. కేసీఆర్ మాత్రం  చంద్రబాబు చెప్పు చేతల్లో  ఉన్నాడన్నారు.

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో సంక్రాంతి ఫుడ్ ఫెస్టివల్ | Sankranthi Food Festival Reaction | Asianet News Telugu
Journalists Arrest : జర్నలిస్టులను ఎందుకు అరెస్ట్ చేశారు.. అసలు ఏమిటీ వివాదం..?