ప్రజా శాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయంగా పోరాడితే తాను ఈ రోజే ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇప్పించగలనని అన్నారు. సీబీఐ, ఐటీ సోదాల భయం ఎవరికి ఉన్నా.. వారు తన వద్దకు రావొచ్చని పిలుపు ఇచ్చారు.
ప్రజా శాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ఆమెకు ఈ రోజు ఎవరైనా బెయిల్ ఇప్పించగలరా? అని కేఏ పాల్ అడిగారు. తాను బెయిల్ ఇప్పించగలనని చెప్పారు. న్యాయంగా పోరాడితే తాను బెయిల్ ఇప్పించగలనని స్పష్టం చేశారు. అంతేకాదు, సీబీఐ భయం ఉంటే, ఐటీ సోదాల భయం ఉంటే తన వద్దకు రావొచ్చని, ఎవరైనా సరే తన వద్దకు రావొచ్చని వివరించారు.
కేసీఆర్ మారాలని, లేకుంటే చిత్తుచిత్తుగా ఓడిస్తామని తాను చెప్పలేదా? అని కేఏ పాల్ అన్నారు. కేసీఆర్ మారారా? మారకపోగా.. సిరిసిల్లలో తనను కొట్టించారని ఆరోపించారు. ఆ రోజే కేసీఆర్‌ను శపించినట్టు కేఏ పాల్ తెలిపారు. ఇప్పటికైనా వరంగల్‌లో బాబు మోహన్‌కు మద్దతు ఇవ్వాలని, అలాగైతే తాను కేసీఆర్‌ను క్షమిస్తానని వివరించారు.
అలాగే.. ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని అన్నారు. చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు మద్దతు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అంతేకాదు, జూనియర్ ఎన్టీఆర్ సీక్రెట్‌గా తనకే మద్దతు ఇస్తున్నారని వివరించారు. ఈ విషయమై ఏపీ ప్రజలు ఆలోచించాలని కోరారు.