భారత జాగృతి సమితి, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం: జీవో నెంబర్ 3 ఏముంది?

By narsimha lode  |  First Published Mar 8, 2024, 11:36 AM IST

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  మహిళలకు ఉద్యోగావకాశాల్లో అన్యాయం జరుగుతుందని భారత జాగృతి ఆరోపిస్తుంది
 


హైదరాబాద్: జీవో నెంబర్ 3 తో ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రభుత్వ విద్యా సంస్థల్లో మహిళలకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందని  భారత జాగృతి సంస్థ ఆరోపిస్తుంది.  జీవో నెంబర్  3ను రద్దు చేయాలని  భారత జాగృతి సంస్థ శుక్రవారం నాడు ఇందిరాపార్క్ వద్ద ఆందోళనకు దిగింది.

also read:హైద్రాబాద్ మెట్రో రైలు రెండో దశ: ఎక్కడి నుండి ఎక్కడి వరకు, ఎప్పుడు పూర్తవుతాయంటే?

Latest Videos

undefined

 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు అన్యాయం చేసే జీవో నెంబర్ 3ను రద్దు చేయాలని భారత జాగృతి సంస్థ ఆందోళనకు దిగింది.గతంలో ఉన్న  41, 56 జీవోలను రద్దు చేస్తూ జీవో 3 ను  తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది.

also read:ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ. 100 తగ్గింపు: మోడీ ప్రకటన

ప్రభుత్వ ఉద్యోగాల్లో  మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు వీలుగా ఉన్న  పాత జీవోలను రద్దు చేసి 3 నెంబర్ జీవోను అమలు చేయడం ద్వారా మహిళలు  నష్టపోతున్నారని భారత జాగృతి సంస్థ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆరోపిస్తున్నారు.  ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గురుకులాల్లో సిబ్బంది నియామకాల్లో  మహిళలకు జరిగిన అన్యాయాన్ని ఆమె ప్రస్తావించారు.  గురుకులాల్లో సిబ్బంది నియామకంలో జీవో నెంబర్ 3 కారణంగా మహిళలకు 12 శాతం కూడ రిజర్వేషన్ దక్కలేదని  కవిత ఆరోపించారు.

also read:షూలో పాము: సోషల్ మీడియాలో వైరలైన వీడియో

రోస్టర్ పాయింట్ లో రిజర్వేషన్లను రద్దు చేస్తున్నట్టుగా జీవో 3 లో తెలంగాణ ప్రభుత్వం పేర్కొన్న విషయాన్ని భారత జాగృతి సంస్థ ప్రస్తావిస్తుంది. రోస్టర్ పాయింట్ రిజర్వేషన్లు రద్దు చేయడంతో  బీసీ, ఎస్‌సీ, ఎస్టీ మహిళా అభ్యర్థులకు  ప్రభుత్వ ఉద్యోగాల్లో నష్టం జరగనుందని కవిత ఆరోపిస్తున్నారు.
రోస్టర్ విధానాన్ని ఎత్తివేయడం వల్ల ఖాళీగా ఉన్న మహిళా పోస్టుల స్థానంలో  పురుషులతో భర్తీ చేసే అవకాశం ఉందని  భారత జాగృతి చెబుతుంది.

also read:వై.ఎస్. సునీతారెడ్డి ఆత్మీయ సమ్మేళనం: రాజకీయాల్లోకి వస్తారా?

రోస్టర్ విధానంపై 2022 నవంబర్ మాసంలో తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని కవిత గుర్తు చేస్తున్నారు. అయితే ఈ విషయమై హైకోర్టును ఆశ్రయించి పాత విధానాన్నే కేసీఆర్ సర్కార్ అమలు చేసిన విషయాన్ని  కవిత ప్రస్తావిస్తున్నారు.

అయితే భారత జాగృతి  లేవనెత్తిన అంశాలను కాంగ్రెస్ కొట్టిపారేస్తుంది.  సాంకేతిక అంశాలను సాకుగా చూపి ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు  భారత జాగృతి సంస్థ ప్రయత్నిస్తుందని  కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కౌంటరిచ్చారు.
 

click me!