మహాశివరాత్రి: శివాలయాలకు పోటెత్తిన భక్తులు, ప్రత్యేక పూజలు

By narsimha lode  |  First Published Mar 8, 2024, 8:05 AM IST

మహాశివరాత్రిని పురస్కరించుకోని  ఆలయాల్లో భక్తులు  కిటకిటలాడుతున్నాయి.  ఇవాళ ఉదయం నుండే  భక్తులు శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.


హైదరాబాద్: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని  రెండు తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాల్లో  భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం నాడు తెల్లవారుజాము నుండే  ఆలయాలకు భక్తులు బారులు తీరారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

also read:వై.ఎస్. సునీతారెడ్డి ఆత్మీయ సమ్మేళనం: రాజకీయాల్లోకి వస్తారా?

Latest Videos

undefined

శ్రీశైలం ఆలయానికి భక్తులు  పోటెత్తారు. శ్రీశైలంలో  మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవాన్ని నిర్వహించనున్నారు.తెలుగు రాష్ట్రాల్లోని వేయి స్థంబాల గుడి, రామప్ప, కాళేశ్వరం, సిద్దేశ్వర ,శ్రీకాళహస్తి, కీసరగుట్ట తదితర ఆలయాలకు భక్తులు పోటేత్తారు.కోటిపల్లి, ద్రాక్షారామ ఆలయాల్లో ఇవాళ తెల్లవారుజాము నుండే భక్తులు  ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా  అధికారులు  జాగ్రత్తలు తీసుకుంటున్నారు.మహాశివరాత్రి సందర్భంగా భక్తులు  ఉపవాస దీక్షలు చేస్తారు.  హిందువుల పండుగలలో  ఇది ముఖ్యమైన పండుగ. దేశ వ్యాప్తంగా  ఈ పండుగను  భక్తులు జరుపుకుటున్నారు.

also read:ఎన్‌డీఏలోకి టీడీపీ?: సీట్ల సర్ధుబాటుపై చర్చలు

శివాలయాల్లో రుద్రాభిషేకాలు నిర్వహిస్తున్నారు భక్తులు,  శివరాత్రిని పురస్కరించుకొని  పలు ఆలయాల్లో  భక్తులు శివుడికి అభిషేకాలు నిర్వహిస్తున్నారు. శ్రీకాళహస్తి  ఆలయంలో  ఇవాళ తెల్లవారుజాము రెండు గంటల నుండి భక్తులను అనుమతిస్తున్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని శ్రీకాళహస్తి ఆలయంలో రాహు కేతు పూజలను రద్దు చేశారు.

also read:భారత్‌లో పుట్‌పాత్ పై కూరగాయలు విక్రయించిన రష్యన్ యువతి: వీడియో వైరల్

శివరాత్రి రోజున భక్తులు ఉపవాసం చేస్తారు.  శివాలయాలు సందర్శిస్తారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మహా శివరాత్రి ఉపవాసం అజ్ఞానాన్ని అధిగమించి ఆత్మసాక్షాత్కారాన్ని పొందడంలో సహాయపడుతుందని పురాణాలు చెబుతున్నాయి.

click me!