హైద్రాబాద్ మెట్రో రైలు రెండో దశ: ఎక్కడి నుండి ఎక్కడి వరకు, ఎప్పుడు పూర్తవుతాయంటే?

By narsimha lode  |  First Published Mar 8, 2024, 10:21 AM IST

హైద్రాబాద్ మెట్రో రెండో దశ పనులకు తెలంగాణ ప్రభుత్వం ఇవాళ భూమిపూజ చేయనుంది. 


హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలోని మెట్రో రైలు రెండో దశ పనులకు తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి  శుక్రవారం నాడు భూమి పూజ చేయనున్నారు. హైద్రాబాద్ మెట్రో రెండో దశ పనుల్లో భాగంగా హైద్రాబాద్ ఎంజీబీఎస్ నుండి ఫలక్ నుమా వరకు  5.5 కి.మీ.  మెట్రో మార్గం పనులకు  సీఎం రేవంత్ రెడ్డి  ఇవాళ భూమి పూజ చేయనున్నారు.   ఫలక్ నుమా నుండి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు వరకు  మెట్రో రైలు నిర్మాణ పనులు కారిడార్ 2లో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం  తలపెట్టింది.

also read:షూలో పాము: సోషల్ మీడియాలో వైరలైన వీడియో

Latest Videos

undefined

కారిడార్ నాలుగులో భాగంగా  నాగోల్ నుండి ఎల్ బీ నగర్ వరకు మెట్రో రైలు మార్గాన్ని నిర్మించనున్నారు. నాగోల్ నుండి శంషాబాద్ విమానశ్రయం వరకు 29 కి.మీ. మెట్రో మార్గాన్ని నిర్మిస్తారు.  ఈ మార్గాన్ని నాగోల్-ఎల్ బీ నగర్, చాంద్రాయణగుట్ట-మైలార్ దేవ్ పల్లిని కూడ కలపాలని ప్రతిపాదించారు. ఆరాంఘర్ మీదుగా మైలార్ దేవ్ పల్లి నుండి హైకోర్టు వరకు  మెట్రో మార్గాన్ని పొడిగించనున్నారు.

also read:మహాశివరాత్రి: శివాలయాలకు పోటెత్తిన భక్తులు, ప్రత్యేక పూజలు

 రెండో దశలో  70 కి.మీ. మేరకు హైద్రాబాద్ మెట్రోను విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కారిడార్ ఐదులో రాయదుర్గం నుండి అమెరికన్ కాన్సులేట్ వరకు  విస్తరించనున్నారు.  రాయదుర్గం మెట్రో స్టేషన్ నుండి  బయోడైవర్శిటీ జంక్షన్ ,నానక్ రామ్ గూడ జంక్షన్, విప్రో జంక్షన్,యూఎస్ కాన్సులేట్ వరకు ఈ పనులను విస్తరించనున్నారు.మియాపూర్ మెట్రో స్టేషన్ నుండి బీహెచ్ఈఎల్ వరకు  మెట్రో ను  కారిడార్ ఆరులో భాగంగా విస్తరించనున్నారు.  ఎల్ బీ నగర్ మెట్రో స్టేషన్ నుండి హయత్ నగర్ వరకు  కారిడార్ లో ఏడులో మెట్రో రైలు పనులను విస్తరించాలని ప్రభుత్వం తలపెట్టింది.

also read:వై.ఎస్. సునీతారెడ్డి ఆత్మీయ సమ్మేళనం: రాజకీయాల్లోకి వస్తారా?

హైద్రాబాద్ మెట్రో రెండో దశ నిర్మాణ పనులకు రూ.18,900 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మెట్రో నిర్మాణానికి అవసరమైన నిధులను 20 శాతం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. మిగిలిన నిధులను  రుణంగా ప్రభుత్వం తీసుకుంటుంది. 

also read:ఎన్‌డీఏలోకి టీడీపీ?: సీట్ల సర్ధుబాటుపై చర్చలు

 ఎంజీబీఎస్ నుండి ఫలక్ నుమా వరకు  5.5 కి.మీ దూరంలో  నాలుగు స్టేషన్లను ఏర్పాటు చేస్తారు.  సాలర్ జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, ఫలక్ నుమా వద్ద స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు.

ఈ మెట్రో మార్గంలో రోడ్డు విస్తరణ, నిర్మాణాలను తొలగించాల్సిన అవసరం నెలకొంది.  దీని కోసం ప్రభుత్వం రూ. 2 వేల కోట్లను కేటాయించనుంది.మెట్రో రెండో దశ కారణంగా  ప్రార్థనా మందిరాలకు  ఇబ్బందులు లేకుండా  రూట్ ను  ఏర్పాటుచేసేందుకు  అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.మూడేళ్లలో ఈ పనులను పూర్తి చేసే అవకాశం ఉంది.

click me!