ఉత్తమ్ పై పోటీ ఎవరు: ఎన్నారైకి టీఆర్ఎస్ సీటు దక్కేనా?

By pratap reddyFirst Published 7, Sep 2018, 1:13 PM IST
Highlights

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఎవరిని పోటీకి దింపుతారనే ఆసక్తి నెలకొంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ సీటు నుంచి శాసనసభకు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. 

సూర్యాపేట: తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఎవరిని పోటీకి దింపుతారనే ఆసక్తి నెలకొంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ సీటు నుంచి శాసనసభకు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థిని కేసిఆర్ ప్రకటించలేదు. 

కోదాడ నియోజకవర్గం అభ్యర్థిని కూడా కేసిఆర్ ప్రకటించలేదు. ఈ నియోజవర్గం నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కోదాడ టీఆర్ఎస్ టికెట్ కోసం శ శిదర్‌రెడ్డి, చందర్‌రావు పోటీ పడుతున్నారు. 

టీడీపీ నియోజక వర్గ ఇన్‌చార్జి బొల్లం మల్లయ్యయాదవ్‌ టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు, జరగబోయే ఎన్నికల్లో అతనికే టికెట్‌ కేటాయించనున్నట్లు కొద్ది రోజుల క్రితం ప్రచారం జరిగింది. మల్లయ్య యాదవ్ ను పార్టీలో చేర్చుకుని టికెట్ ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు.

హుజుర్‌నగర్‌ నియోజక వర్గంలో తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. మరోసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నారు. అయితే ఇటీవల మఠంపల్లి మండలానికి చెందిన ఎన్నారై శానంపూడి సైదిరెడ్డి టీఆర్‌ఎ్‌సలో చేరి టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి జగదీష్‌రెడ్డికి ఆయన సన్నిహితుడు. 

తనకు టికెట్ వస్తుందని చెబుకుంటూ నియోజక వర్గంలో అంకిరెడ్డి ఫౌండేషన్‌ పేరుతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లోకిచొచ్చుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకనొక దశలో శంకరమ్మ, సైదిరెడ్డి వర్గీయులు పరస్పరం బహిరంగంగా దూషించుకోవడంతో పాటు ఘర్షణకు దిగారు. ఈ స్థితిలో టికెట్ సైదిరెడ్డికి దక్కుతుందా లేదా అనేది చూడాల్సిందే.

సంబందిత వార్తాకథనం

ఉత్తమ్ కు కేసిఆర్ చెక్: హుజూర్ నగర్ బరిలో ఎన్నారై

Last Updated 9, Sep 2018, 2:11 PM IST