టిక్కెట్ కట్: కేసీఆర్‌తో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు భేటీ

By narsimha lodeFirst Published Sep 7, 2018, 12:56 PM IST
Highlights

చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు  శుక్రవారం నాడు ప్రగతి భవన్ లో  సీఎం కేసీఆర్ ను కలిశారు. గురువారం నాడు ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఓదేలుకు చోటు దక్కలేదు.  


హైదరాబాద్: చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు  శుక్రవారం నాడు ప్రగతి భవన్ లో  సీఎం కేసీఆర్ ను కలిశారు. గురువారం నాడు ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ఓదేలుకు చోటు దక్కలేదు.  

ఓదేలు స్థానంలో  పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ కు  చెన్నూర్ టిక్కెట్టును కేటాయించారు. పెద్దపల్లి ఎంపీ స్థానం నుండి  వచ్చే ఎన్నికల్లో వివేక్ బరిలోకి దిగే అవకాశం ఉంది. దీంతో  వివేక్ కోసం సుమన్ ను చెన్నూరు అసెంబ్లీ స్థానంలో బరిలోకి దింపినట్టు సమాచారం.

ఇదిలా ఉంటే  చెన్నూరులో  ఓదేలు కంటే  బాల్క సుమన్ కు  విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని  కూడ ఆ పార్టీ భావిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.   ఈ కారణాలన్నింటిని దృష్టిలో ఉంచుకొని  చెన్నూరు టిక్కెట్టును సుమన్ కు కేటాయించారు.

ఓదేలు ప్రభుత్వ విప్ గా కూడ పనిచేశారు. అయితే తాజాగా ప్రకటించిన జాబితాలో టిక్కెట్టు దక్కకపోవడంతో  శుక్రవారం నాడు ఓదేలు సీఎం కేసీఆర్ ను కలిశారు.  ఓదేలుకు ఎమ్మెల్సీ లేదా మరో పదవిని ఇవ్వనున్నట్టు కేసీఆర్ హమీ ఇచ్చినట్టు సమాచారం. న్యాయం చేస్తామని  హమీ ఇచ్చినట్టు  తెలుస్తోంది. 

మరోవైపు ఓ రైతును ఓదేలు గతంలో  తీవ్రంగా మందలించినట్టుగా ఆరోపణలు వచ్చాయి.  ఈ విషయమై  ఓదేలు వివరణ కూడ ఇచ్చారు.  స్థానికంగా పార్టీ అవసరాల రీత్యానే ఓదేలుకు టిక్కెట్టు ఇవ్వలేదని టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారంలో ఉంది. 

ఈ వార్త చదవండి

సిట్టింగ్ సీటు కోల్పోయిన మాజీ జర్నలిస్ట్: ఆంథోల్ లో క్రాంతికి సీటు

 

click me!