కోదండరాం ఎక్కడున్నారో తెలుసా...?

Published : Feb 22, 2017, 08:50 AM ISTUpdated : Mar 26, 2018, 12:00 AM IST
కోదండరాం ఎక్కడున్నారో తెలుసా...?

సారాంశం

రాజ్యం పంపించిన పోలీసులు... అర్ధరాత్రి మూడు గంటలకు దొంగల్లా వచ్చారు. తలుపు బద్దలుకొట్టి బలవంతంగా ఇంట్లోకి చొరబడ్డారు. నిరసన గళం వినిపించిన ఓ ప్రొఫెసర్ గొంతు పెగలకుండా జేశారు. సూర్యుడు ఉదయించకముందే ఆయనను చీకటి ప్రదేశంలో దాచారు.

రాజ్యం పంపించిన పోలీసులు... అర్ధరాత్రి మూడు గంటలకు దొంగల్లా వచ్చారు. తలుపు బద్దలుకొట్టి బలవంతంగా ఇంట్లోకి చొరబడ్డారు. నిరసన గళం వినిపించిన ఓ ప్రొఫెసర్ గొంతు పెగలకుండా జేశారు. సూర్యుడు ఉదయించకముందే ఆయనను చీకటి ప్రదేశంలో దాచారు.

 

తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదంరాం అరెస్టుపై సోషల్ మీడియాలో కొందరి ఆవేదనకు అక్షర రూపం ఇది.

 

నాడు తెలంగాణ ఉద్యమంలో కోదండరాంను బంగారు ముఖం అని పొగిడిన కేసీఆర్ యేనా ఈ రోజు ఈ పని చేయించిందని తెలంగాణ వాదులు ఆశ్యర్యపోతున్నారు.

 

సంఘవిద్రోహ శక్తులు ఉంటారని శాంతిభద్రత సమస్యలని కోదండరాం చేపట్టిన నిరసన ర్యాలీకి అనుమతి రాకుండా విజయవంతంగా అడ్డుకున్న ప్రభుత్వం ఇప్పడు సమైక్య పాలకుల్లాగానే ఉద్యమించిన వారిపై ఉక్కుపాదం మోపుతోందని ప్రజాస్వామ్యవాదులు మండిపడుతున్నారు.

 

కాగా, రాత్రి మూడు గంటలకు కోదండరాం నివాసానికి వెళ్లి ఆయన ఇంటి తలుపులు బద్దలుకొట్టి అరెస్టు చేయడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఇది పోలీసుల అత్యుత్సాహమా లేక పాలకుల ముందస్తూ వ్యూహమా తెలియదు కానీ, ఈ ఘటనతో సర్కారుపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత మాత్రం వస్తోంది.

 

పోలీసులు కోదండరాంను అరెస్టు చేసి దాదాపు 12 గంటలు కావొస్తుంది. కానీ, ఇప్పటి వరకు ఆయన ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. కనీసం ఆయన కుటుంబ సభ్యులకైనా ఆయన ఆచూకీ తెలియదు.

 

‘సార్ ఫ్యామిలీ ( కోదండరాం కుటుంబసభ్యులకు)కి ఇంతవరకు సార్ ఎక్కడ ఉన్నారో తెలియదు... సార్ రోజు వేసుకునే టాబ్లెట్స్ ఇద్దామంటే కూడా పోలీసులు అడ్రెస్ చెప్పట్లేదు! సార్ ఫ్యామిలీ మరియు తెలంగాణ అంతా సార్ ఎక్కడ ఉన్నా వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు! దయ చేసి షేర్ చేయండి....’ అని జేఏసీ తన అధికార ఫేస్ బుక్ పేజీ మీద ప్రజలకు విజ్ఝప్తి చేసిందటే పోలీసులు ఈ ఘటనలో ఎంత అరాచకంగా ప్రవర్తించారు అర్థం చేసుకోవచ్చు.

 

అంతేకాదు తెలంగాణ ఉద్యమానికి గుండెకాయగా మారిన ఓయూ లో కూడా పోలీసులు మితిమీరి ప్రవర్తించడం సమైక్య పాలననే మరోసారి తలపిస్తోందని

విద్యార్థులు వాపోతున్నారు.


తాము ఉద్యోగాల గురించి అడుగుతుంటే అసలు మీకు భవిష్యత్తే ఉండదని హెచ్చరించడం ఎంతవరకు సబబు అని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

 

ప్రశ్నించడం నేర్పిన పార్టీనే... నియామకాల కోసం ఉద్యమించాలని నూరిపోసిన నేతలే ఇప్పుడు తమ గొంతునొక్కుతున్నారని మండిపడుతున్నారు.

PREV
click me!

Recommended Stories

Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్
Cold Wave: వ‌చ్చే 2 రోజులు జాగ్ర‌త్త‌, ఈ జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్‌.. స్కూల్‌ టైమింగ్స్‌లో మార్పులు