హైదరాబాద్ నగర వాసులకు కోతుల బెడద నుండి శాశ్వత పరిష్కారం ఎప్పటికి దొరుకునో...?

By telugu team  |  First Published Dec 29, 2019, 5:03 PM IST

హైదరాబాద్ లో కోతుల బెడద రోజురోజుకి తీవ్రతరం అవుతూనే ఉంది. జిహెచ్ఎంసీ అధికారులు కోతులను పట్టడానికి ఉత్తరప్రదేశ్ నుంచి ప్రొఫెషనల్ కోతులు పట్టేవారిని పిలిపించినప్పటికీ అంత ఉపయుక్తకరంగా ఉన్నట్టు మాత్రం అనిపించడం లేదు.


హైదరాబాద్ లో కోతుల బెడద రోజురోజుకి తీవ్రతరం అవుతూనే ఉంది. జిహెచ్ఎంసీ అధికారులు కోతులను పట్టడానికి ఉత్తరప్రదేశ్ నుంచి ప్రొఫెషనల్ కోతులు పట్టేవారిని పిలిపించినప్పటికీ అంత ఉపయుక్తకరంగా ఉన్నట్టు మాత్రం అనిపించడం లేదు. ఇక్కడ స్థానికంగా ఉన్న వారు ఎవరు కూడా ముందుకు రాకపోవడంతో ఉత్తరప్రదేశ్ నుంచి కోతులుపట్టే వారిని తీసుకురావాల్సి వచ్చిందని జిహెచ్ఎంసీ అధికారులు అంటున్నారు. 

వచ్చిన కోతులు పట్టేవారు మారేడ్ పల్లి, సికింద్రాబాద్,టపాలు పద్మారావు నగర్ తదితర ప్రాంతాల నుంచి అత్యాధునికమైన పరికరాలను తీసుకొచ్చి కోతులను పడుతున్నారు.

Latest Videos

undefined

గత సంవత్సరం కూడా ఈ విధంగానే కోతులను పట్టి ఈ సమస్యకీక చరమగీతం పాడినట్టే అని అధికారులు భావించారు. కానీ మల్లి ఏడాదిలోపే కోతుల సంచారం విపరీతంగా పెరిగిపోయింది. 

Also read: గ్రేటర్ సందిగ్ధత : ముందస్తు నిర్వహణ సాధ్యమేనా?

కోతులనుపట్టి దగ్గర్లోని అడవుల్లో వదిలేస్తుంటారు. కానీ అడవులనరికివేత వల్ల అవి తిరిగి మళ్ళీ నగరం మీథైకే వస్తుంటాయి. అడవుల నరికివేత వాళ్ళ వాటికి తినడానికి తిండి దొరక్క నగరం మీదపడుతున్నాయి. ఎండాకాలం రాయితీ వాటికి అడవుల్లో నిలువనీడ కూడా దొరకడంలేదు. ఈ నేపథ్యంలో మల్లి కోతువుల్ని కూడా తిరిగి మీదపడుతున్నాయి. 

ఎండాకాలమప్పుడు అడవుల్లో చోటులేక నగరాల మీద పడుతున్నాయి. ముఖ్యంగా కాలనీల్లో ఉండే పెద్ద చెట్లను తమ ఆవాసం చేసుకొని జీవనం సాగిస్తున్నాయి కోతులు. నగర శివార్లలోని మూతబడ్డ ఫ్యాక్టరీలను కోతులు తమ స్థిర నివాసంగా మార్చుకున్నాయి. అక్కడున్న కోతులు ఒక సంవత్సరం తిరిగే లోపు రెండింతలవుతున్నాయి. 

click me!