ప్రాణాలు కాపాడిన వాట్సప్ మెసేజ్

Published : Dec 17, 2016, 10:43 AM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
ప్రాణాలు కాపాడిన వాట్సప్ మెసేజ్

సారాంశం

బాధితులను ఆసుపత్రుల్లో చేర్చేందుకు వాట్సప్ మెసేజ్ ఉపయోగపడటం నిజంగా ఆశ్చర్యమే.

ఆధునిక సాంకేతికత ఓ కుంటుంబాన్ని ప్రమాదం నుండి కాపాడింది. అది కూడా ఓ మెసేజ్ కు మంత్రి స్పందించటం, బాధితలకు సత్వర వైద్య సహాయం అందిచటంతో నలుగురు ప్రాణాపాయం నుండి బయటపడ్డారు.. ఇదంతా కూడా ఓ మెజేజ్ ద్వారానే జరిగింది. వెంటనే బాధితులను ఆసుపత్రుల్లో చేర్చేందుకు వాట్సప్ మెసేజ్ ఉపయోగపడటం నిజంగా ఆశ్చర్యమే.

 

ఇంతకీ జరిగిన సంగతి ఏమిటంటే, ఆదివారం అర్థరాత్రి వేళ గంగానదిలో స్నానాలకని గోదావరి నదికి ధర్మపురికి చెందిన ఓ కుంటుంబం వెళ్లింది. స్నానాలైన తర్వాత కుటుంబం తిరిగి తమ స్వస్ధలానికి ప్రయాణమైంది. హటాత్తుగా ఎదురైన ప్రమాదం నుండి తప్పుకోలేక పోవటంతో అర్ధరాత్రి ఆ వాహనం ప్రమాదానికి గురైంది.

 

అందులో ప్రయాణిస్తున్న వారంతా తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే, అదే దారిలో పోతున్న వారెవరో ప్రమాదాన్ని గుర్తించారు. గాయాలపాలైన వారితో మాట్లాడగా తామంతా సిద్ధిపేటకు చెందిన వారమని వారు చెప్పారు. ఆరా తీసిన వారిలో ఓ విలేకరి కూడా ఉన్నారు.

 

వెంటనే మంత్రితో తనకున్న పరిచయంతో తన ఫొన్ నుండే జిల్లామంత్రి హరీష్ రావు ఫోన్ లోని వాట్సప్ మెసెంజర్ కు జరిగిన ఘటన గురించి మెసేజ్ ద్వారా అప్రమత్తం చేసారు.  కొద్దిసేపటికి మంత్రి హరీష్ స్పందించారు.

 

ప్రమాదానికి గురైన వారి వివరాలు తెలుసుకోవటమే కాకుండా జిల్లా కలెక్టర్, ఏరియా ఆసుపత్రి సూపరెండెంట్ ను కూడా మంత్రి అప్రమత్తం చేసారు. దాంతో కొద్ది సేపటికే ఘటనా స్ధలానికి వైద్య బృందాలు చేరుకున్నాయి.

 

బాధితులకు తక్షణ చికిత్సను అందిస్తూనే వారి  పరిస్ధతిని అంచనా వేసిన వైద్య బృందం మెరుగైన వైద్యం కోసం వారందరినీ సిద్ధిపేట ఆసుపత్రికి తరలించాలనుకున్నారు. అయితే, అప్పటికే నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.

 

దాంతో వారికి మెరుగైన వైద్యం కోసం అప్పటికప్పుడు జగిత్యాలలో ఉన్న వైద్యులతో మాట్లాడారు. వారి సలహా మేరకు తక్షణ చికిత్స అందిస్తూనే వారిని సిద్దిపేట ఆస్పత్రికి తరలించారు. నలుగురి ప్రాణాలను కాపాడేందుకు ఓ వాట్సప్‌ మెసేజ్‌ కారణమవ్వటం గమనార్హం.

 

PREV
click me!

Recommended Stories

KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu
KCR Press Meet: ఇప్పటి వరకు ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క: కేసీఆర్| Asianet News Telugu