గతంలో జోనల్ వ్యవస్థ ఇలా ఉండేది: ఇప్పుడిలా...

By narsimha lodeFirst Published 30, Aug 2018, 2:53 PM IST
Highlights

 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త జోన్ల విధానాన్ని తెచ్చింది. ఈ జోన్లకు కేంద్రం ఆమోదముద్ర వేసింది.గురువారం నాడు గెజిట్ నోఫికేషన్ కూడ విడుదల చేసింది. 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త జోన్ల విధానాన్ని తెచ్చింది. ఈ జోన్లకు కేంద్రం ఆమోదముద్ర వేసింది.గురువారం నాడు గెజిట్ నోఫికేషన్ కూడ విడుదల చేసింది. అయితే  గతంలో ఉన్న జోన్ల విధానానికి ప్రస్తుత జోన్ల విధానానికి  చాలా వ్యత్యాసం ఉంటుంది. 95 శాతం స్థానికులకే ఉద్యోలు దక్కేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త జోన్ల విధానానికి శ్రీకారం చుట్టింది.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఉన్న జోన్ల విధానానికి బదులుగా రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా తెలంగాణ సర్కార్ కొత్త జోన్లను ఏర్పాటు చేసుకొంది. కొత్త జోనల్ విధానం ద్వారా రాష్ట్రంలోని 95 శాతం స్థానికులకే ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి. ఓపెన్ కేటగిరిలో మరో5 శాతం ఉద్యోగాలు వస్తాయి. ఓపెన్ కేటగిరిలో కూడ స్థానికులకు అవకాశాలు దక్కే అవకాశం  లేకపోలేదు. 

తెలంగాణలోని 31 జిల్లాల్లో ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా జోన్లను ప్లాన్ చేశారు. గతంలో జిల్లా, జోనల్, రాష్ట్ర క్యాడర్ పోస్టుల భర్తీలో కల్పించిన రిజర్వేషన్ల నిష్పత్తి వల్ల  నిరుద్యోగులకు నష్టం జరుగుతోందనే అభిప్రాయం లేకపోలేదు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదాన్ని టీఆర్ఎస్ తీసుకోవడంలో కూడ ఉద్యోగ నియామాకాల్లో  చోటు చేసుకొన్న వివక్ష ప్రధాన కారణంగా టీఆర్ఎస్ నేతలు చెప్పేవారు. 

గతంలో ఉన్న జోనల్ విధానం ద్వారా     తెలంగాణ ప్రాంతంలోని నిరుద్యోగులకు నష్టం జరిగిందే అభిప్రాయాలు టీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేసేవారు. గత జోనల్ విధానం వల్ల జిల్లా పోస్టుల్లో 80 శాతం లోకల్, 20 శాతం ఓపెన్, జోనల్ పోస్టుల్లో 70 శాతం లోకల్, 30 శాతం ఓపెన్, జోనల్ గెజిటెడ్ పోస్టుల్లో 60 శాతం లోకల్, 40 శాతం ఓపెన్ క్యాటగిరీ రిజర్వేషన్లు కల్పించారు. 

రాష్ట్రస్థాయి పోస్టుల్లో స్థానిక రిజర్వేషన్ లేదు. దీనికితోడు ఓపెన్ క్యాటగిరీకి నాన్‌లోకల్ అని పేరు తగిలించి స్థానికేతరులే ఉద్యోగాలను కొల్లగొట్టారు. స్థానికులైన మెరిట్ అభ్యర్థులకు కూడా లోకల్ రిజర్వేషన్‌లోనే ఉద్యోగాలు కేటాయించారు. రాష్ట్రస్థాయి పోస్టుల్లో స్థానిక రిజర్వేషన్లు లేకపోవడంతో తీరని నష్టం జరిగేదనే అభిప్రాయాలు ఉన్నాయి. 

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా కొన్ని నియామాకాలను చేపట్టాలని భావిస్తోంది. సుమారు 50 వేల ఉద్యోగాల నియామాకాలను చేపట్టాలని భావిస్తోంది.ఈ తరుణంలో కొత్త జోన్లతో  తెలంగాణలోని స్థానికులకు ఉద్యోగాలు ఎక్కువగా దక్కే అవకాశం ఉందని ప్రభుత్వవర్గాలు తెలిపాయి.

ఈ వార్తలు చదవండి

శుభవార్త: కొత్త జోన్లకు ఆమోదం తెలిపిన కేంద్రం, గెజిట్ విడుదల
కేసీఆర్ హ్యాపీ: కొత్త జోనల్ వ్యవస్థకు మోడీ గ్రీన్ సిగ్నల్

జోనల్ వ్యవస్థ అంటే ఏమిటీ?: మోడీ చేతికి చిక్కిన కేసీఆర్

Last Updated 9, Sep 2018, 1:44 PM IST