సంక్షేమ పథకాలు ‘ఉచితాలు’ కావు - ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌.. బీజేపీపై మండిపాటు

Published : Aug 10, 2022, 12:06 PM IST
సంక్షేమ పథకాలు ‘ఉచితాలు’ కావు - ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌.. బీజేపీపై మండిపాటు

సారాంశం

సంక్షేమ పథకాలను ‘ఉచితాలు’ అని పేర్కొనడం సరైంది కాదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తమ ప్రభుత్వం  ప్రజల కోసం దాదాపు 250 సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని చెప్పారు.

సంక్షేమ ప‌థ‌కాలు ‘ఉచితాలు’ కావని ఎమ్మెల్సీ కల్వ‌కుంట్ల క‌విత అన్నారు. ఇటీవ‌ల దేశ వ్యాప్తంగా ఉచిత ప‌థ‌కాల‌పై చ‌ర్చ న‌డుస్తున్న నేప‌థ్యంలో ఆమె ఈ వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం వార్త సంస్థ ఏఎన్ఐతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం పేదలు, నిరుపేదల కోసం 250 సంక్షేమ పథకాలను అమలు చేస్తోంద‌ని అన్నారు. ‘‘ పేదల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవడం ప్రభుత్వంగా మన బాధ్యత. స్కీమ్ లను ఉచితాలు అనే పేర్కొనే ధోరణిని మేము వ్యతిరేకిస్తున్నాం ’’  అని అన్నారు.
ఎస్సై పరీక్ష సరిగా రాయలేదని.. మనస్తాపంతో యువతి ఆత్మహత్య..

సంక్షేమ పథకాలను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం ఒత్తిడి తెస్తోందని కవిత అన్నారు. “10 లక్షల కోట్ల రూపాయిలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాఫీ చేసింది. వీటిని నేను ‘ఉచితం’ అని నమ్ముతున్నాను.  దేశంలోని మేధావి వర్గం ప్ర‌స్తుత వాతావ‌ర‌ణాన్ని వ్యతిరేకించాలని నేను అభ్యర్థిస్తున్నాను” అని ఆమె అన్నారు.

“ భారతదేశం అన్ని నేపథ్యాల ప్రజలతో కూడిన విభిన్నమైన దేశం. పేదరికం చక్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి, (వారి) పురోగతిని నిర్ధారించడానికి, బలహీన వర్గాలకు సాయం అందించ‌డం ప్రభుత్వంగా మ‌న  బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా కృషి చేయాలి. కేంద్ర ప్రభుత్వం దీనికి ఎలాంటి ఆటంకం కలిగించకూడదు. ’’ అని కల్వకుంట్ల కవిత అన్నారు.

COVID-19 pandemic: క‌రోనా దెబ్బ‌తో సామాజిక నైపుణ్యాల‌కు దూరం.. పరధ్యానంలో పిల్ల‌లు: స‌ర్వే

ఇదిలా ఉండ‌గా.. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మంగ‌ళ‌వారం ఇలాంటి వ్యాఖ్య‌లే చేసింది. ఎన్నికల ప్రచార సమయంలో ఉచిత ప‌థ‌కాలు ఇస్తామ‌ని హామీ ఇచ్చిన రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని వ్యతిరేకిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఉచిత నీరు, విద్యుత్, రవాణా వంటి హామీలు ‘ఉచితాలు’ కాదని పేర్కొంది. అసమాన సమాజంలో అవసరమైన నిబంధనలు అని ఆప్ స్పష్టం చేసింది. ఎన్నికల ప్రచార సమయంలో ఉచితాలు ఇస్తామని హామీ ఇచ్చిన రాజకీయ పార్టీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ పిటిషన్ దాఖలు చేశారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే