ఎస్సై పరీక్ష సరిగా రాయలేదని.. మనస్తాపంతో యువతి ఆత్మహత్య..

By Bukka SumabalaFirst Published Aug 10, 2022, 11:33 AM IST
Highlights

ఎస్సై పరీక్ష సరిగా రాయలేదని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలో కలకలం రేపింది. 

కామారెడ్డి : ఎస్సై పరీక్ష సరిగా రాయలేకపోయానని ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. భిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామ చెరువులో దూకి పంచశీల (20) అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. డిగ్రీ పూర్తి చేసిన పంచశీల హైదరాబాద్ లో ఉంటూ మూడు రోజుల క్రితం నిర్వహించిన ఎస్సై ప్రాథమిక పరీక్ష రాసింది. అయితే పరీక్ష సరిగా రాయలేకపోయింది. దీంతో యువతి మనస్థాపానికి గురైంది. ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు మద్రూర్ మండలం కోరేగావ్ గ్రామ వాసురాలిగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి గవర్నమెంట్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి

ఇదిలా ఉండగా, పూణేకు చెందిన 23 ఏళ్ల యువ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. బాగ్ సెవానియా ప్రాంతంలోని తన అద్దె ఫ్లాట్‌లో ఆదివారం విషం మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సంఘటన స్థలంలో సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంట్లో తాను ఇంత దారుణమైన నిర్ణయం తీసుకున్నందుకు తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పాడు. దీంతోపాటు సూసైడ్ నోట్‌లో ఒక అమ్మాయిని తాను గాఢంగా ప్రేమిస్తున్నానని చెప్పుకొచ్చాడు. అయితే ఆ అమ్మాయి పేరు అందులో రాయలేదు. 

తన సోదరిని జాగ్రత్తగా చూసుకోవాలని కూడా తల్లిదండ్రులను అభ్యర్థించాడు.కాగా సదరు ఇంజనీర్ కొంతకాలంగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడని, ఆమె పేరును ఛాతీపై టాటూ వేయించుకున్నాడన్న విషయం అతని మరణం నేపథ్యంలో వెలుగులోకి వచ్చింది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ, కొన్ని కారణాల వల్ల అతని కల నెరవేరలేదని పోలీసులు తెలిపారు. మంద్‌సౌర్‌కు చెందిన మృతుడు నవీన్ మాల్వియా బాగ్-సెవానియాలోని సాకేత్ నగర్‌లోని ఓ ఫ్లాట్‌లో అద్దెకు ఉంటున్నాడని దర్యాప్తు అధికారి ఏఎస్‌ఐ రామ్‌దేని రాయ్ తెలిపారు. 

ఇటీవలే బీటెక్ పూర్తి చేసి పూణెలోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం సంపాదించాడు. ఆదివారం, అతను అద్దెకు తీసుకున్న ఫ్లాట్‌లో విషం తాగాడు. అతని పరిస్థితి విషమంగా ఉండడాన్ని గమనించిన అతని స్నేహితులు సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. కేసు నమోదు చేసినట్లు బాగ్ సెవానియా పోలీసులు తెలిపారు.
 

click me!