CM Revanth Davos Tour : దావోస్ చేరుకున్న సీఎం రేవంత్ టీమ్ - జ్యూరిచ్ ఎయిర్‌పోర్ట్‌లో ఘనస్వాగతం

Published : Jan 16, 2024, 05:48 AM IST
CM Revanth Davos Tour : దావోస్ చేరుకున్న సీఎం రేవంత్ టీమ్ - జ్యూరిచ్ ఎయిర్‌పోర్ట్‌లో ఘనస్వాగతం

సారాంశం

CM Revanth: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం జ్యూరిచ్‌కు చేరుకుంది. దావోస్ వరల్డ్ ఎకనమిక్ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన సీఎంకు ప్రవాస భారతీయులు స్వాగతం పలికారు.

Telangana CM Revanth Reddy at Davos: రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా తొలి విదేశీ పర్యటనకు వెళ్లారు. దావోస్ లో ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరయ్యారు. జనవరి 15 నుంచి 18వ తేదీ వరకు స్విట్జర్లాండ్ లోని జరగనున్న ఈ సదస్సులో తెలంగాణకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. దావోస్ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బోర్గ్ బ్రెండెతో సోమవారం సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు అవకాశాలు, రాష్ట్రంలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం వివరాలను WEF చీఫ్ కు రేవంత్ రెడ్డి వివరించారు.

 అలాగే... వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బోర్గ్ బ్రెండెతో పాటు ఇతర ప్రముఖులను, నిర్వాహకులతో  సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తమ రాష్ట్రానికి పెట్టుబడులకు అవకాశాలపై వారితో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. అంతకుముందు ప్రపంచ ఆర్థిక సదస్సు (WEF 2024)లో పాల్గొనడానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ విమానాశ్రయంలో పలువురు భారత ప్రముఖులు వీరికి ఘన స్వాగతం పలికారు.రాష్ట్రాన్ని పెట్టుబడులు తీసుకొచ్చి మరింత అభివృద్ది చేసేందుకు దావోస్ ను వేదికగా చేసుకోవాలని రాష్ట్ర బృందానికి సూచించారు. 

ఈ పర్యటన భాగంగా తెలంగాణలో కొత్త ప్రభుత్వ దార్శనికతను, ప్రాధాన్యతలను దిగ్గజ కంపెనీల ప్రతినిధులకు వివరించనున్నారు. ఐటీ రంగంలో అగ్రగామిగా, జీవ వైద్య శాస్త్ర రంగానికి ముఖ్య కేంద్రంగా అభివృద్ధి చెందిన మన రాష్ట్ర అనుకూలతలను ప్రపంచానికి చాటి చెప్పి, భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా దేశ, అంతర్జాతీయంగా ఉన్న ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక తెలంగాణలో 5°C టెంపరేచర్స్.. ఈ ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్
School Holidays : వచ్చే బుధ, గురువారం స్కూళ్లకు సెలవేనా..?