బహ్రెయిన్‌లో జరిగిన వివాహ వేడుక.. తెలంగాణ రాష్ట్ర అధికార, ప్రతిపక్షాలను ఒక్క చోటికి తెచ్చే వేదికగా మారింది.
Bahrain: పెళ్లి వేడుక అంటే కుటుంబం అంతా సందడిగా ఉంటుంది. బంధు మిత్రులతో వేడుక హడావిడిగా ఉంటుంది. ఎందరో మిత్రులను, దూరపు బంధువులను ఏకం చేసే వేదికగా వివాహాలు మారుతుంటాయి. కానీ, బుధవారం బహ్రెయిన్‌లో జరిగిన ఓ పెళ్లి ఏకంగా రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలను కూడా ఒకే వేదిక మీదికి తెచ్చింది. ఇంతకీ ఆ పెళ్లి ఎవరిది?
కాంగ్రెస్, బీఆర్ఎస్‌తో సంబంధాలున్న కుటుంబాల మధ్య ఈ వేడుక జరిగింది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి కుమారుడు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పీ వెంకట రామిరెడ్డి సోదరుడు పీ మహిందర్ రెడ్డి కూతురు పెళ్లి జరిగింది. ఈ పెళ్లి వేడుక గల్ఫ్ కంట్రీ బహ్రెయిన్‌లో జరిగింది. పెళ్లి కొడుకు లోహిత్ పెండ్లి కొడుకు బృందం ఈ రోజే బారాత్‌తో బహ్రెయిన్‌కు వెళ్లింది. పెళ్లి జరిగింది.
Also Read: Raebareli: గాంధీ కుటుంబం యూపీని వదిలేసినట్టేనా? కాంగ్రెస్ కంచుకోటల నుంచి బయటికి..!
ఈ పరిణయ వేడుకకు మంత్రి వెంకట్ రెడ్డి కూడా హాజరయ్యారు. చాలా మంది ఆహ్వానితులు ఈ రోజే చార్టర్డ్ ఫ్లైట్‌లో హైదరాబాద్‌కు తిరిగి వచ్చేశారు.
ఎమ్మెల్సీ వెంటకరామిరెడ్డి కుటుంబం రియల్ ఎస్టేట్ సంస్థ రాజా పుష్ప. శ్రీనివాస రెడ్డి కుటుంబానికి రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కలిగి ఉండటంతోపాటు పలు సంస్థలతో సంబంధాలు ఉన్నాయి.