weather report : అలెర్ట్.. తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వానలే..

Published : Jul 08, 2022, 11:23 AM IST
weather report : అలెర్ట్.. తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వానలే..

సారాంశం

తెలంగాణలో మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలకు ఆరెంజ్, రెడ్ అలెర్ట్ లు ప్రకటించింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. 

తెలంగాణ మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని భార‌త వాతావ‌ర‌ణ కేంద్ర తెలిపింది. శుక్రవారం, శనివారాల్లో హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు (64-114 మి.మీ.) కురిసే అవకాశం ఉందని హెచ్చ‌రిచింది. 

మహబూబ్‌నగర్‌లో వరద నీటిలో చిక్కుకున్న స్కూల్ బస్సు: 25 మందిని కాపాడిన స్థానికులు

పలు జిల్లాలకు రెడ్ అలర్ట్‌లు (204 మిమీ కంటే ఎక్కువ భారీ వర్షం), మ‌రి కొన్ని జిల్లాల‌కు ఆరెంజ్ అలర్ట్‌లు (115-204 మిమీ) జారీ చేసింది. ఈ నేప‌థ్యంలో అస‌వ‌ర‌మైన చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల యంత్రాంగాల‌ను ఆదేశించింది. అయితే హైద‌రాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, నగరంలోని కొన్ని ప్రాంతాలలో మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో తీవ్ర వానలు సంభవించే అవకాశం ఉంద‌ని చెప్పింది.

‘నాకేం తెలియదు, కావాలనే నన్ను ఇరికించారు’ పాతపాటే పాడిన ఆవుల సుబ్బారావు..

జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లోని ఐసోలేటెడ్ ప్రాంతాలకు ఐఎండీ శుక్రవారం ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. అయితే మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. 

IMD సర్క్యులర్ ప్రకారం  హైదరాబాద్‌లో వర్షాల వ‌ల్ల లోతట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌య‌మ‌య్యే అవ‌కాశం ఉంద‌ని, ట్రాఫిక్ ర‌ద్దీ, అలాగే విద్యుత్, నీరు, ఇతర సామాజిక అవాంతరాలు ఏర్ప‌డే అవ‌కాశం  ఉంద‌ని పేర్కొంది. జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో కొన్ని గంటలపాటు రైలు లేదా రోడ్డు రవాణాకు అంతరాయం ఏర్పడిందని కూడా తెలిపింది. రెడ్ అలర్ట్ జారీ చేసిన ప్రాంతాల్లో పంట నష్టం లేదా వ్యవసాయ భూములు నీట మునిగే అవకాశం కూడా ఉంద‌ని తెలిపింది. ఈ నేప‌థ్యంలో ఆయా శాఖ‌ల అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఐఎండీ సూచించింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?