‘నాకేం తెలియదు, కావాలనే నన్ను ఇరికించారు’ పాతపాటే పాడిన ఆవుల సుబ్బారావు..

By SumaBala Bukka  |  First Published Jul 8, 2022, 9:15 AM IST

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసం కేసులో ఆవుల సుబ్బారావు కస్టడీ ముగిసింది. అయితే విధ్వంసం విషయంలో తనకేమి తెలియదని, తనను ఇరికించారని ఆయన చెప్పుకొచ్చాడు. 


హైదరాబాద్ :  agneepathకు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన విధ్వంసం కేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న Aavula Subbaraoతో పాటు మరో ముగ్గురి కస్టడీ ముగిసింది. ఆవుల సుబ్బారావుతో పాటు అతని అనుచరులను రెండు రోజులపాటు సికింద్రాబాద్ ఘటనకు సంబంధించి పలు కోణాల్లో రైల్వే పోలీసులు ప్రశ్నించారు. ఘటన జరిగే ముందురోజు సికింద్రాబాద్ లోనే ఉండి ఆర్మీ అభ్యర్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం, రైల్వే స్టేషన్ విధ్వంసానికి సంబంధించి వ్యూహాలను రచించడం, విద్యార్థులతో ఫోన్లో మాట్లాడి వారిని ఉసిగొల్పే విధంగా ప్రేరేపించడం.. వంటి అంశాలపై ప్రశ్నించారు. ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని, తనను కావాలనే ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని విచారణలో చెప్పినట్లు తెలిసింది. కస్టడీ ముగిసిన అనంతరం సుబ్బారావుతో పాటు మరో ముగ్గురికి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి చంచల్గూడ జైలుకు తరలించారు. 

ఇదిలా ఉండగా, అగ్నిపథ్ ప్రకటనకు నిరసనగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జూన్ 17న జరిగిన విధ్వంసం కేసులో సూత్రధారిగా వ్యవహరించిన ఆవుల సుబ్బారావును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో మరో ఏడుగురు నిందితులను జూన్ 24న ఉత్తర మండలం టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ నిమిత్తం రైల్వే పోలీసులకు వీరిని అప్పగించారు. ఈ ఏడుగురు సుబ్బారావు రైల్వే పోలీసులు ఆధారాలు సేకరించారు. అంతకుముందు సుబ్బారావుతో పాటు ఎనిమిది మందిని గాంధీ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించి రైల్వే పోలీస్ ఠాణాకు తరలివచ్చారు. తాజాగా అదుపులోకి తీసుకున్న వారిని కూడా విచారించిన తర్వాత సుబ్బారావు న్యాయస్థానంలో హాజరుపరిచారు ఎందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు.

Latest Videos

undefined

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసం కేసుతో సంబంధం లేదు: కోర్టులో ఆవుల సుబ్బారావు బెయిల్ పిటిషన్

అయితే సికింద్రాబాద్ విధ్వంసం కేసులో ఆవుల సుబ్బారావు ప్రత్యక్షంగా పాల్గొన్నాడనడానికి ఏ ఆధారాలు లేవని ఆయన తరఫు న్యాయవాది రైల్వే స్టేషన్ వద్ద విలేకరులతో అన్నారు. శాంతియుతంగా నిరసన తెలపాలని ఆయన ఆర్మీ అభ్యర్థులకు సూచించాడని 17వ తేదీన సుబ్బారావు అసలు సికింద్రాబాదులోని లేడని, బోడుప్పల్ లోని సాయి డిఫెన్స్ అకాడమీలో ఉన్నాడని అన్నారు. ఆయన నేరానికి పాల్పడినట్లు ఆధారాలు లేకపోవడం వల్లనే పోలీసులు ఇన్ని రోజులు అదుపులో ఉంచుకున్నారు అని తెలిపారు. కాగా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసం కేసులో సాయి డిఫెన్స్ అకాడమీకి చెందిన ఆవుల సుబ్బారావు కీలకంగా వ్యవహరించారని రైల్వే సిట్ పోలీసులు  గతనెల 16న గుర్తించారు.

ఆందోళన చేయాలని వాట్సాప్ గ్రూపులో రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టారని కూడా పోలీసులు గుర్తించారు. మూడు రోజులు ఆవుల సుబ్బారావును టాస్క్ఫోర్స్ పోలీసులు, రైల్వే పోలీసులు విచారించారు. ఈ విచారణ సమయంలో కీలక విషయాలను పోలీసులు గుర్తించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో శాంతియుతంగా ఆందోళన చేయాలని కోరినట్లు మొదట పోలీసుల విచారణలో ఒప్పుకున్నారని సమాచారం.  అయితే పోలీసులు సేకరించిన ఆధారాలను సుబ్బారావు ముందు పెట్టి ప్రశ్నించారు. సుబ్బారావు ఆదేశాల మేరకే తాము విధ్వంసానికి పాల్పడినట్లు కొందరు ఆర్మీ అభ్యర్థులు పోలీసుల విచారణలో ఒప్పుకున్నారని తెలిపింది.

click me!