Hyderabad: రాష్ట్రంలోకి శీతాకాలం ప్రవేశిస్తోంది. అయితే, ఈ సారి వానాకాలం కాస్త ముందుగానే ముఖం చాటేయడంతో ఎండలు దంచికొడుతున్నాయి. శీతాకాలం వస్తున్నా ఇంకా వేసవికాలంగానే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో శీతాకాలంలో వేసవికాలం కొనసాగుతున్నదని ప్రస్తుత వాతావరణ పరిస్థితులపై చర్చ సాగుతోంది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల సెల్సియస్‌ను దాటాయని వాతావరణ శాఖ నివేదికలు పేర్కొంటున్నాయి.
Summer in winter: రాష్ట్రంలోకి శీతాకాలం ప్రవేశిస్తోంది. అయితే, ఈ సారి వానాకాలం కాస్త ముందుగానే ముఖం చాటేయడంతో ఎండలు దంచికొడుతున్నాయి. శీతాకాలం వస్తున్నా ఇంకా వేసవికాలంగానే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో శీతాకాలంలో వేసవికాలం కొనసాగుతున్నదని ప్రస్తుత వాతావరణ పరిస్థితులపై చర్చ సాగుతోంది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల సెల్సియస్‌ను దాటాయని వాతావరణ శాఖ నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే, ఈ ఏడాది ప్రారంభం నుంచి కాస్త భిన్నంగా వాతావరణం ఉండటంపై ఎల్ నినో ప్రభావం వుందనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి.
వివరాల్లోకెళ్తే.. ఈ ఏ చలికాలంలో హైదరాబాదు నివాసితులు వేసవి వేడిని అనుభవిస్తూనే ఉన్నారు. అనేక ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల సెల్సియస్‌కు మించి నమోదవుతున్నాయి. ఇదే సమయంలో నగరంలో కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి. వర్షాకాలం ముగిసినప్పటి నుంచి హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి.
undefined
ఒకవైపు వేడి.. మరోవైపు చలి.. !
ప్రస్తుతం హైదరాబాద్ పరిస్థితులు విచిత్రంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే, హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలే కాకుండా కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. ఆదివారం హిమాయత్‌నగర్, అంబర్‌పేటలో అత్యధికంగా 23.1 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే, ఈ ప్రాంతాల్లోనే కాకుండా మరిన్ని ప్రాంతాల్లో అత్యధిక గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
నగరంలోని గరిష్ట ఉష్ణోగ్రతలు ఇలా..
ప్రాంతాలు | డిగ్రీ సెల్సియస్‌లో గరిష్ట ఉష్ణోగ్రత |
హిమాయత్‌నగర్ | 33.1 |
బహదూర్‌పురా | 33.1 |
నాంపల్లి | 33.2 |
ఖైరతాబాద్ | 33.3 |
ఆసిఫ్‌నగర్ | 33.5 |
సైదాబాద్ | 33.5 |
అంబర్‌పేట | 33.6 |
మోండామార్కెట్ | 34.5 |
షేక్‌పేట | 35 |
మారేడ్ పల్లి | 35 |
హైదరాబాద్‌లో 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత పొడిగా అక్టోబర్ నెలగా రికార్డు సృష్టించదని రిపోర్టులు పేర్కొంటున్నాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా శీతాకాలంలో వేసవి వేడిని అనుభవించడమే కాకుండా, ఈ సంవత్సరం హైదరాబాద్ 30 సంవత్సరాలలో అక్టోబర్ పొడిగా ఉంది. నెల రోజులు మిగిలి ఉన్నప్పటికీ ఈ సమయంలో నగరంలో వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ రిపోర్టులు పేర్కొనడం గమనార్హం. సాధారణంగా, అక్టోబర్ నగరానికి తడి, వర్షపు నెలగా పరిగణించబడుతుంది. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో నగరంలో వర్షాలు కురవలేదు.
అయితే, ఎల్ నినో సంవత్సరం అయినప్పటికీ, రుతుపవనాల సీజన్ హైదరాబాద్ తో పాటు మొత్తం రాష్ట్రానికి అధిక వర్షపాతం నమోదైంది. టీఎస్‌డీపీఎస్ వాతావరణ సూచనల ప్రకారం హైదరాబాద్‌లో రానున్న మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం లేదు. హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు 32 నుంచి 34 డిగ్రీల సెల్సియస్ మధ్య, కనిష్ట ఉష్ణోగ్రత 20-22 డిగ్రీల సెల్సియస్‌లో ఉండే అవకాశం ఉంది. రాబోయే కొద్ది రోజులు, హైదరాబాద్‌లో శీతాకాలం సీజన్‌లో వేసవి లాంటి వేడి కొనసాగుతుందని సమాచారం.