2024 ఎన్నికలు అత్యంత కీలకం: సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా

By narsimha lode  |  First Published Nov 17, 2022, 4:02 PM IST

వచ్చే ఎన్నికల్లో బీజేపీని  కేంద్రంలో  అధికారంలోకి రాకుండా  చూసేందుకు  తమ  శక్తివంచనలేకుండా  ప్రయత్నిస్తామని  సీపీఐ జాతీయ ప్రధాన  కార్యదర్శి డి.రాజా చెప్పారు. బీజేపీకి  వ్యతిరేకంగా  ఆయా రాష్ట్రాల్లో  ప్రాంతీయ పార్టీలతో కలిసి పనిచేస్తామన్నారు సీపీఐ నేత. 


హైదరాబాద్:2024  ఎన్నికలు  అత్యంత కీలకమైనవని  సీపీఐ జాతీయ ప్రధాన  కార్యదర్శి  డి. రాజా  చెప్పారు. సీపీఐ  రాష్ట్ర  కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు  రాజా నిన్న  హైద్రాబాద్ కు  వచ్చారు.  గురువారంనాడు  ఆయన  హైద్రాబాద్  పార్టీ కార్యాలయంలో  మీడియాతో  మాట్లాడారు.  బీజేపీకి  వ్యతిరేకంగా  ప్రాంతీయ పార్టీలతో  కలిసి పనిచేస్తామని రాజా  స్పష్టం చేశారు.  దేశంలో  ప్రస్తుత  రాజకీయ పరిస్థితులపై  అధ్యయనం  చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ  పాన్  ఇండియన్  సెక్యులర్ పార్టీ అని  ఆయన  చెప్పారు. ఆయా రాష్ట్రాల్లో  పరిస్థితులను  బట్టి  ఎన్నికల్లో  ఎలా  వెళ్లాలనే  విషయాలపై  రాష్ట్ర  కమిటీలు  నిర్ణయాలు తీసుకుంటాయని  రాజా  తెలిపారు. 

also  read:నేటి నుండి సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు: కీలకాంశాలపై చర్చ

Latest Videos

రాష్ట్ర ప్రభుత్వాల్లో  గవర్నర్ల జోక్యం సరికాదన్నారు.దేశంలోని  కొన్ని  రాష్ట్రాల్లో గవర్నర్లు,  సీఎంలకు  మధ్య  చోటు  చేసుకున్న  వివాదాలను ఆయన ప్రస్తావించారు. 2024  ఎన్నికల్లో  దేశంలో  బీజేపీ  ప్రభుత్వం  ఏర్పాటు  కాకుండా చూడాలని  లెఫ్ట్ పార్టీలు  భావిస్తున్నాయి.దీంతో   బీజేపీయేతర  పార్టీలను  ఏకం చేసే పనిలో  లెఫ్ట్  పార్టీలు  ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రయత్నంలో  భాగంగా  ఆయా రాష్ట్రాల్లో  ప్రాంతీయ పార్టీలు, బీజేపీయేతర పార్టీలతో  చర్చలు జరుపుతున్నాయి.  రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి  ఎన్నికల సమయంలో కూడ విపక్ష పార్టీలు  తమ  అభ్యర్ధులను  బరిలోకి దింపాయి.  2024  ఎన్నికల్లో  కూడా  విపక్ష పార్టీల కూటమిలో  మరిన్ని పార్టీలు  చేరేలా  ప్రయత్నాలు  చేస్తున్నాయి.  తెలంగాణ  రాష్ట్రంలో  ఇటీవల  జరిగిన మునుగోడు ఉప  ఎన్నికల్లో  టీఆర్ఎస్ కి  సీపీఐ  మద్దతును ప్రకటించింది.లెఫ్ట్  పార్టీలతో  వచ్చే ఎన్నికల్లో  కూడా  టీఆర్ఎస్ మైత్రీ  కొనసాగే  అవకాశం లేకపోలేదు.
 

click me!