హైద్రాబాద్‌లో నకిలీ వెపన్ లైసెన్స్ ముఠా అరెస్ట్:ఆయుధాలు, బుల్లెట్లు సీజ్

Published : Nov 17, 2022, 02:44 PM IST
హైద్రాబాద్‌లో నకిలీ  వెపన్  లైసెన్స్  ముఠా అరెస్ట్:ఆయుధాలు, బుల్లెట్లు  సీజ్

సారాంశం

నకిలీ  వెపన్  లైసెన్స్ ఇస్తున్న  ముఠాను  వెస్ట్  జోన్ టాస్క్  ఫోర్స్  పోలీసులు  ఇవాళ  అరెస్ట్ చేశారు.పోలీసు ఉన్నతాధికారుల  సంతకాలను ఫోర్జరీ చేసి  లైసెన్సులు  జారీ చేస్తున్నారని పోలీసులు  గుర్తించారు.

హైదరాబాద్: నకిలీ  వెపస్  లైసెన్స్  ఇస్తున్న  ముఠాను  వెస్ట్ జోన్  టాస్క్ ఫోర్స్  పోలీసులు  గురువారంనాడు నలుగురిని అరెస్ట్  చేశారు. మరో  ముగ్గురి  కోసం  పోలీసులు పరారీలో  ఉన్నారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు  చర్యలు  చేపట్టారు.నిందితుల నుండి  30 సింగిల్  బోర్ , 3 డబుల్  బోరు గన్లు స్వాధీనం, రివాల్వర్,  140  బుల్లెట్లను పోలీసులు  సీజ్  చేశారు.పోలీసు  ఉన్నతాధికారుల సంతకాలు  ఫోర్జరీ చేసి  నకిలీ  గన్  లైసెన్స్ లను  ఈ  ముఠా  అందిస్తుంది. ఈ  లైసెన్స్ లతో  పాటు  ఆయుధాలను  విక్రయిస్తున్నారు.   ఈ  విషయమై  అందిన  కచ్చితమైన  సమాచారం  మేరకు  పోలీసులు నిందితులను పట్టుకున్నారు.ఈ  ముఠాలో  మరో  ముగ్గురు  సభ్యులు  పరారీలో  ఉన్నారు.  వీరి కోసం పోలీసులు గాలింపు  చర్యలు  చేపట్టారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu