ఢిల్లీ లిక్కర్ స్కాంలో శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబుల కస్టడీని ఈడీ మరో నాలుగు రోజుల పాటు పొడిగించింది సీబీఐ ప్రత్యేక కోర్టు. అదే విధంగా ఈ కేసులో బుుచ్చిబాబు, అరుణ్ రామచంద్రపిళ్లైలను విచారణకు రావాలని ఈడీ నోటీసులు అందించింది.
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాంలో శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబుల కస్టడీని మరో నాలుగు రోజులు పొడిగిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు గురువారంనాడు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో చార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబు, అరుణ్ రామచంద్రన్ పిళ్లైలను విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈ నెల 10వ తేదీన శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబులను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో సమాచారం రాబట్టేందుకు గాను ఈడీ అధికారులు కోర్టు అనుమతితో వారం రోజులుగా కస్టడీలోకి తీసుకున్నారు. ఇవాళ్టితో కస్టడీ ముగిసింది. గురువారంనాడు మద్యాహ్నం సీబీఐ ప్రత్యేక కోర్టులో శరత్ చంద్రారెడ్డి, వినయ్ బాబులను ఈడీ అధికారులు సీబీఐ కోర్టులో హాజరుపర్చారు. అయితే నిందితులు విచారణకు సహకరించడం లేదని ఈడీ తరపున న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మరో వారం రోజుల పాటు నిందితులను కస్టడీకి ఇవ్వాలని ఈడీ తరపు న్యాయవాదులు కోరారు. వీరితో పాటు మరో ఇద్దరిని కూడా విచారణకు రావాలని కోరినట్టుగా ఈడీ తరపు న్యాయవాదలు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబు, అరుణ్ రామచంద్రన్ పిళ్లైలను విచారణకు రావాలని నోటీసులు పంపినట్టుగా కోర్టుకు ఈడీ న్యాయవాదులు తెలిపారు.ఈ నలుగురిని విచారించాలని భావిస్తున్నామని కోర్టుకు తెలిపారు. ఈ కారణంగానే కస్టడీని పొడిగించాలని ఈడీ తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. అయితే నాలుగు రోజుల విచారణకు మాత్రమే సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతిని ఇచ్చింది.
undefined
రాబిన్ డిస్టిలరీస్ పేరుతో అరుణ్ రామచంద్రన్ పిళ్లై లైసెన్స్ పొందారు. సౌత్ లాబీ పేరుతో హవాలా రూపంలో డబ్బులను తరలించారని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ విషయాలపై నిందితుల నుండి సమాచారాన్ని సేకరించాల్సి ఉందని ఈడీ అధికారులు చెబుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే హైద్రాబాద్ కేంద్రంగా పలు దఫాలు ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైద్రాబాద్ కేంద్రంగా జరిపిన సోదాల్లో సేకరించిన సమాచారంతోపాటు ఈ కేసులో అరెస్టైన వారిచ్చిన సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారిని అరెస్ట్ చేయడం ప్రస్తుతం కలకలం రేపుతుంది.
also read:ఢిల్లీ లిక్కర్ స్కాం: శరత్ చంద్రారెడ్డి భార్య విమాన సంస్థపై ఈడీ ఆరా
ఢిల్లీ లిక్కర్ స్కాంలో శరత్ చంద్రారెడ్డిని ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో మూడు రోజులపాటు ఈడీ అధికారులు విచారించారు. అయితే తమ విచారణకు శరత్ చంద్రారెడ్డి సహకరించలేదని ఈడీ అధికారులు చెబుతున్నారు. దీంతో ఈ నెలలో మరోసారి ఆయనను విచారించారు. ఈ నెల 10వ తేదీన అరెస్ట్ చేశారు.