దుబ్బాక ఫలితాలు రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపవు: ఉత్తమ్

Published : Nov 17, 2020, 01:42 PM IST
దుబ్బాక ఫలితాలు రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపవు: ఉత్తమ్

సారాంశం

 దుబ్బాక ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపవని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు.  

హైదరాబాద్:  దుబ్బాక ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపవని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. దుబ్బాకలో కాంగ్రెస్ క్యాడర్ వీక్ అని ఆయన ఒప్పుకొన్నారు. సానుభూతితోనే బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు విజయం సాధించాడని ఆయన చెప్పారు.

టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు రఘునందన్ రావుకి పడిందని ఆయన అభిప్రాయపడ్డారు. హైద్రాబాద్ నగర అభివృద్ధికి కాంగ్రెస్ ఎంతో చేసిందని ఆయన గుర్తు చేశారు. నగర ఓటర్లు కాంగ్రెస్ కు పట్టం కడుతారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. 

టీఆర్ఎస్ కు లబ్ది చేకూరేలా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ వెంట వెంటనే ఎప్పుడైనా ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు.

also read:కాంగ్రెస్‌కు షాక్: బీజేపీలోకి మాజీ మేయర్ బండ కార్తీక

దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూద దక్కలేదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి పడిపోయింది. ఈ ఎన్నికల్లో అనుహ్యాంగా బీజేపీ విజయం సాధించింది. టీఆర్ఎస్ కు కంచుకోట లాంటి దుబ్బాకలో బీజేపీ విజయం సాధించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు తెరతీసింది. 
 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో కొత్త‌గా ఎలివేటెడ్ కారిడార్లు.. ఈ ప్రాంతాల్లో భూముల ధ‌ర‌లు పెర‌గ‌డం ఖాయం
Holidays : జనవరి 2026 లో ఏకంగా 13 రోజులు సెలవులే.. అన్నీ లాంగ్ వీకెండ్స్..!