జంట నగరాల్లో వరద సహాయం: ఎన్నికల సంఘం క్లారిటీ

Published : Nov 17, 2020, 12:58 PM ISTUpdated : Nov 17, 2020, 01:04 PM IST
జంట నగరాల్లో వరద సహాయం: ఎన్నికల సంఘం క్లారిటీ

సారాంశం

 జంటనగరాల్లో వరద సహాయంపై రాష్ట్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది.గత నెల 13, 17  తేదీల్లో నగరంలో కురిసిన భారీ వర్షాలతో పలు కాలనీల్లో వరద నీరు వచ్చి చేరింది. ప్రజలు వరదలతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.

హైదరాబాద్: జంటనగరాల్లో వరద సహాయంపై రాష్ట్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది.

గత నెల 13, 17  తేదీల్లో నగరంలో కురిసిన భారీ వర్షాలతో పలు కాలనీల్లో వరద నీరు వచ్చి చేరింది. వరద ప్రభావతి ప్రజలకు రూ. 10 వేల సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వరద ప్రభావిత ప్రజలకు సహాయం అందించారు.

మరోవైపు  పరిహారం పంపిణీలో తమకు అన్యాయం జరిగిందని  కొందరు నిరసన వ్యక్తం చేశారు. మరికొన్ని చోట్ల తమకు పరిహారం అందలేదని కూడ ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే.

also read:తెలంగాణలో వర్షాలు, వరదలు: హైద్రాబాద్‌కు రేపు రానున్న కేంద్ర బృందం

వరద సహాయం కోసం మీ సేవా ద్వారా ధరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ ధరఖాస్తులను పరిశీలించి అర్హులైనవారికి సహాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

వరద సహాయం అందించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. వరద బాధితులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని కోరింది.నేరుగా లబ్దిదారులకు సహాయం చేయకూడదని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని కోరింది.

నిన్న ఒక్కరోజే రూ.55 కోట్లు బాధితుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది ప్రభుత్వం. ఇవాళ కూడ మీ సేవా కేంద్రాల వద్ద బాధితులు బారులు తీరారు.

PREV
click me!

Recommended Stories

Top 5 Churches in Hyderabad : కేవలం రూ.100 ఉంటే చాలు.. క్రిస్మస్ వేళ ఈ టాప్ చర్చిలను చుట్టిరావచ్చు
హైద‌రాబాద్‌లో కొత్త‌గా ఎలివేటెడ్ కారిడార్లు.. ఈ ప్రాంతాల్లో భూముల ధ‌ర‌లు పెర‌గ‌డం ఖాయం