సీఎం కేసీఆర్ పర్యటన... పోలీసుల ఆధీనంలో రాజన్న సిరిసిల్ల

By Arun Kumar PFirst Published Jul 4, 2021, 12:47 PM IST
Highlights

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించే ప్రాంతాలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు.

సిరిసిల్ల: ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. జిల్లాలో సీఎం పర్యటించే ప్రాంతాలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నెరేళ్ళ బాధితులు, ముంపు గ్రామాల బాధితులు ముఖ్యమంత్రి కేసీఆర్ ను అడ్డుకుంటారన్న సమాచారంతో నిన్నటి(శనివారం) నుండే జిల్లాలో ముందస్తు అరెస్టుల పర్వం కొనసాగుతోంది. 

రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పడిన తరువాత పెద్దఎత్తున చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను నేడు ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. జిల్లాలో సుమారు 210 కోట్లతో నూతనంగా ఏర్పటు చేసిన పలు భవనాలని కేసీఆర్ ప్రారంభించనున్నారు.

read more  సిరిసిల్లలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవం: లబ్దిదారులకు పట్టాలిచ్చిన కేసీఆర్

తంగళ్లపల్లి మండలంలోని మండెపల్లి దగ్గర నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం మండెపల్లిలో నిర్మించిన అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్‎ను ప్రారంభిస్తారు. సిరిసిల్లలో నిర్మించిన నర్సింగ్ కళాశాల, సర్ధాపూర్‌లో నిర్మించిన వ్యవసాయ మార్కెట్ యార్డ్, ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కాంప్లెక్స్(కలెక్టరేట్) భవనంను కేసీఆర్ ప్రారంభించనున్నారు.

సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, సిఎస్, సీఎంవో అధికారులు, ఇతర అధికారులు సిరిసిల్లలో పర్యటిస్తున్నారు. 

click me!