హైద్రాబాద్‌కు నిజాం సంస్కృతి నుండి విముక్తి, 2023లో తెలంగాణలో అధికారం మాదే: అమిత్ షా

By narsimha lodeFirst Published Nov 29, 2020, 3:54 PM IST
Highlights

హైద్రాబాద్ కు నిజాం సంస్కృతి నుండి విముక్తిని కల్పిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తోందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. 

హైదరాబాద్: హైద్రాబాద్ కు నిజాం సంస్కృతి నుండి విముక్తిని కల్పిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హామీ ఇచ్చారు.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తోందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. 

ఆదివారం నాడు ఆయన హైద్రాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తమకు అధికారాన్ని కట్టబెడితే  హైద్రాబాద్ ను మినీ ఇండియాగా తీర్చిదిద్దుతామన్నారు.వారసత్వ పాలన స్థానంలో ప్రజాస్వామ్య పాలన తీసుకొస్తామని ఆయన ప్రకటించారు.

also read:రోడ్‌షో‌ను మధ్యలోనే నిలిపిన అమిత్ షా: నామాలగుండు నుండి బీజేపీ కార్యాలయానికి

2019 లో కూడ కేసీఆర్ దేశమంతా తిరిగారు, ఇక్కడ సగం పార్లమెంట్ స్థానాల్లో ఒడిపోయారు. కేసీఆర్ కూడా దేశమంతా తిరగాలంటే తిరగొచ్చని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ ఫాంహౌస్ నుండి బయటకు రారని చెప్పారు. హైద్రాబాద్ ను చక్కదిద్దడానికి తాము వచ్చినట్టుగా ఆయన చెప్పారు. తాము ఎవరిపై దాడి చేయడానికి రాలేదన్నారు. 

తెలంగాణ అంటే ఒక్క కుటుంబం మాత్రమే కాదని ఆయన చెప్పారు.దమ్ముంటే ఎంఐఎంతో కలిసి పోటీ చేయవచ్చని కదా అని ఆని టీఆర్ఎస్ పై అమిత్ షా సెటైర్లు వేశారు. సర్ధార్ పటేల్ వల్లే హైద్రాబాద్  దేశంలో విలీనమైందన్నారు.

మజ్జిస్ తో కేసీఆర్ రహస్యంగా ఎందుకు సర్ధుబాటు చేసుకొన్నారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
చేసిన పనులు చెప్పుకొని ఎన్నికల్లో గెలవాలి.. కానీ ఓట్ల పోలరైజేషన్ గురించి ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. 

also read:జీహెచ్ఎంసీ మేయర్ పీఠం మాదే: అమిత్ షా

రోహింగ్యాల లెక్క తీస్తామంటే గొడవ పడిందెవరో తెలుసునని అమిత్ షా చెప్పారు.  సచివాలయానికి వెళ్లని కేసీఆర్ కు లెక్కలు తేలియవన్నారు. ప్రభుత్వాన్ని నడుపుతున్న వీరుతో తాము విజయం సాధిస్తామని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. 

అమ్మవారిని మొక్కుకొనేందుకే  భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లినట్టుగా ఆయన వివరించారు. ఈ ఆలయానికి వెళ్లడం తన వ్యక్తిగతమని ఆయన చెప్పారు. దీనికి రాజకీయ కారణాలు లేవన్నారు.ఏ ఎన్నికలనూ కూడా బీజేపీ తక్కువగా చూడదని ఆయన స్పష్టం చేశారు. 


 

click me!