ఆ ఒక్కటి తప్ప అన్ని గెలుస్తాం: కేటీఆర్ సంచలనం

Published : Aug 28, 2018, 05:28 PM ISTUpdated : Sep 09, 2018, 12:12 PM IST
ఆ ఒక్కటి తప్ప అన్ని గెలుస్తాం:  కేటీఆర్ సంచలనం

సారాంశం

2019 ఎన్నికల్లో  ఏ పార్టీతో పొత్తులు ఉండవని తెలంగాణ రాష్ట్ర మున్సిఫల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు.  సింహాం సింగిల్‌గానే వస్తోందని ప్రకటించారు.

హైదరాబాద్:  2019 ఎన్నికల్లో  ఏ పార్టీతో పొత్తులు ఉండవని తెలంగాణ రాష్ట్ర మున్సిఫల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు.  సింహాం సింగిల్‌గానే వస్తోందని ప్రకటించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా  తాము సిద్దంగానే ఉన్నామని  ఆయన తెలిపారు. 

సెప్టెంబర్ రెండో తేదీన  కొంగరనిర్వహించనున్న ప్రగతి నివేదన సభ ఏర్పాట్లను మంత్రి కేటీఆర్ మంగళవారం నాడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా 100 సీట్లను కైవసం చేసుకొంటానమని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. 

రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాల్లో  16 పార్లమెంట్ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకొంటుందని చెప్పారు. ఒక్క ఎంపీ స్థానం గురించి తాను మాట్లాడబోనని చెప్పారు.  ఢిల్లీలో తాను ఎన్నికల కమిషనర్‌ను కలువలేదన్నారు.  శాసనసభ రద్దు అంశం కేబినెట్ పరిధిలో ఉంటుందన్నారు. అయితే  ఎన్నికలు ఎప్పుడొస్తాయనే విషయం తనకు తెలియదని కేటీఆర్ చెప్పారు.

కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొంటే  ప్రజలు బట్టలిప్పి కొడతారని  డిప్యూటీ సీఎం చెప్పారు.  తెలంగాణలో లేని టీడీపీతో తాము ఎలా పొత్తు పెట్టుకొంటామన్నారు.  టీడీపీ తమతో పొత్తు పెట్టుకొంటామంటే చేసేది లేదన్నారు.వచ్చే నెలలో చాలా మంది కాంగ్రెస్ పార్టీ నేతలు తమ పార్టీలో చేరుతారని డిప్యూటీ సీఎం చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌