టార్గెట్ 2019: తెలంగాణలో కాంగ్రెస్ ప్లాన్ ఇదే

By narsimha lodeFirst Published Aug 28, 2018, 4:24 PM IST
Highlights

ముందస్తు ఎన్నికలపై స్పష్టత వస్తే 50 శాతం అభ్యర్ధులను ముందే ప్రకటించాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది.  కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మరింత సమన్వయం అవసరమని కొందరు నేతలు అభిప్రాయపడ్డారు

హైదరాబాద్: ముందస్తు ఎన్నికలపై స్పష్టత వస్తే 50 శాతం అభ్యర్ధులను ముందే ప్రకటించాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది.  కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మరింత సమన్వయం అవసరమని కొందరు నేతలు అభిప్రాయపడ్డారు. పార్టీ క్యాడర్‌లో ఉత్సాహన్ని నింపేందుకుగాను  భారీ సభలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడ ఒకటి ముందుకు వచ్చింది.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం మంగళవారం నాడు హైద్రాబాద్‌ గాంధీ భవన్ ‌లో జరిగింది. ఈ సమావేశంలో  కాంగ్రెస్  పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ కుంతియా పాల్గొన్నారు. ఈ సమావేశంలో  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విషయమై చర్చించారు. ఎన్నికలు ముందుగా వస్తే ఏ రకంగా ఎదుర్కోవాలనే విషయమై చర్చించారు.

అయితే పార్టీ నేతల మధ్య సమన్వయం లేకపోవడంపై ప్రధానంగా చర్చించారు. తమ మధ్య ఉన్న విబేధాలను పరిష్కరించుకొంటూ సమన్వయంతో  ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి ఈ సమావేశంలో ప్రస్తావించారు.  అంతేకాదు పార్టీ క్యాడర్‌లో ఉత్తేజాన్ని నింపేందుకుగాను  భారీ సభలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడ వచ్చింది. 

తెలంగాణలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సంకేతాలు ఇస్తున్న సందర్భంలో  ఎన్నికలు ఎఫ్పుడూ వచ్చినా సిద్దంగా ఉండాలని పార్టీ నేతలను నాయకత్వం ఆదేశాలిచ్చింది.

టీఆర్ఎస్ సభకు ధీటుగా  మరో సభను నిర్వహిస్తే ఎలా ఉంటుందనే విషయమై  కూడ చర్చించినట్టు సమాచారం. అయితే దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు ముందస్తు ఎన్నికలపై స్పష్టత వస్తే 50 శాతం మంది అభ్యర్ధులను ప్రకటించాలని నిర్ణయం తీసుకొన్నారు. పొత్తులపై  కూడ చర్చలు చేసినట్టు సమాచారం.

click me!