కేసీఆర్ పై దేశ ద్రోహం కేసు పెడతాం: బీజేపీ నేత రామచంద్రరావు

Published : Feb 07, 2022, 02:54 PM IST
కేసీఆర్ పై దేశ ద్రోహం కేసు పెడతాం: బీజేపీ నేత రామచంద్రరావు

సారాంశం

తెలంగాణ సీఎం కేసీఆర్ పై దేశ ద్రోహం కేసు పెడతామని బీజేపీ నేత రామచంద్రరావు చెప్పారు. ఈ నెల 14 నుండి కోర్టుల ముందు నిరసనలు చేపడుతామన్నారు. 

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ పై దేశ ద్రోహం కేసు వేయాలని నిర్ణయం తీసుకొన్నామని బీజేపీ నేత రామచంద్రరావు చెప్పారు. ఈ నెల 14 నుండి Courtల ముందు నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నామన్నారు. ఛేంజ్ సీఎం నాట్ కానిస్టిట్యూషన్ పేరుతో కార్యక్రమాలు చేపడుతామని ఆయన వివరించారు. 

ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay పై తెలంగాణ సీఎం  KCR  చేసిన వ్యాఖ్యలపై కూడా న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగ పోస్టులను భర్తీ చేయాలని కోరితే నాన్‌ బెయిలబుల్ కేసులు బనాయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. Narendra Modi బాడీ షేమింగ్‌పై కేసీఆర్ కామెంట్స్‌ను  ఆయన తీవ్రంగా ఖండించారు. దేశ ఆర్థికమంత్రి Nirmala Sitharaman ను వ్యక్తిగతంగా అవమానించేలా మాట్లాడటాన్ని ఆయన తప్పుబట్టారు.

 రాజకీయ దురుద్దేశంతోనే రాజ్యాంగాన్ని తిరిగి రాయాలాంటూ Ambedkar ను అవమానించారన్నారు. Constitution రచించిన వారందరినీ కేసీఆర్ అవమానించారన్నారు. ఇది దేశ వ్యతిరేక చర్యగా అభివర్ణించారు. కేసీఆర్‌పై BJP  ధర్మ యుద్ధాన్ని  ప్రారంభిస్తోందన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలపై కోర్టుల్లో ప్రైవేటు కేసులు వేస్తామని  Ramachander Rao వెల్లడించారు.

ఈ నెల 1వ తేదీన కేంద్ర బడ్జెట్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. కేంద్ర బడ్జెట్ తో ఎవరికి కూడా ప్రయోజనం లేదన్నారు.  మరో వైపు సందర్భంగా ఆయన రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలను విపక్షాలు తప్పుబడుతున్నాయి.

కేసీఆర్  వ్యాఖ్యలను నిరసిస్తూ ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిరసనకు దిగాడు. అంతేకాదు ఢిల్లీలో బీజేపీ నేతలు పాదయాత్ర నిర్వహించారు. హైద్రాబాద్ గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతలు రెండు రోజుల పాటు దీక్షలు చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే
Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి