త్వరలోనే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా: స్క్రీనింగ్ కమిటీ భేటీ తర్వాత ఠాక్రే

By narsimha lode  |  First Published Sep 6, 2023, 2:51 PM IST

మరోసారి కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుందని  కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు.  రెండో సమావేశం తర్వాత అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని మాణిక్ రావు ఠాక్రే హైద్రాబాద్ లో ప్రకటించారు.


హైదరాబాద్: త్వరలోనే  కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ  మాణిక్ రావు ఠాక్రే చెప్పారు. హైద్రాబాద్‌లోని ఓ హోటల్ లో  కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం బుధవారంనాడు జరిగింది.ఈ సమావేశం ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణిక్ రావు  ఠాక్రే మీడియాతో మాట్లాడారు.  పీఈసీ నివేదికలోని అంశాలపై  చర్చించామన్నారు.పీఈసీ సభ్యులు, పార్టీ సీనియర్ల  సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని  మాణిక్ రావు ఠాక్రే తేల్చి చెప్పారు.
స్క్రీనింగ్ కమిటీలో ఇంకా చర్చించాల్సిన అంశాలున్నాయన్నారు.

మరోసారి స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుందని ఠాక్రే తెలిపారు. పీఈసీ సభ్యులు, డీసీసీ అధ్యక్షులు, సీనియర్లు ఇచ్చిన  నేతల సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు.త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామని  మాణిక్ రావు ఠాక్రే తెలిపారు. స్క్రీనింగ్ కమిటీ  సమావేశం ఉన్నందున తాను  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో భేటీ కాలేదన్నారు.  ఈ సమావేశం ముగిసినందున కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసానికే వెళ్తున్నట్టుగా ఆయన  చెప్పారు.

Latest Videos

also read:అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మరింత వేగవంతం: మూడో రోజూ స్క్రీనింగ్ కమిటీ భేటీ

స్క్రీనింగ్ కమిటీకి  అందరు నేతల నుండి  వచ్చిన  ప్రతిపాదనలపై చర్చించినట్టుగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. మరో సారి  స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో అభ్యర్థుల ఎంపికపై  చర్చించనున్నట్టుగా భట్టి విక్రమార్క తెలిపారు. త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామని  సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తమ పార్టీకి చెందిన కీలక నేతగా ఆయన పేర్కొన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అసంతృప్తి చెందుతారన్నారు.  ఆయన వైబ్రెంట్ నేత అని  మల్లుభట్టి విక్రమార్క తెలిపారు.

click me!