అసంతృప్తితో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి: బుజ్జగిస్తున్న పార్టీ నేతలు

By narsimha lode  |  First Published Sep 6, 2023, 2:14 PM IST

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  పార్టీ పదవులు దక్కలేదని అసంతృప్తితో ఉన్నారు.దీంతో ఆయనను పార్టీ నేతలు బుజ్జగిస్తున్నారు.


హైదరాబాద్: భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో కీలక పదవి దక్కుతుందని భావించినప్పటికీ ఆయనకు పార్టీలో పదవులు దక్కలేదు.దీంతో  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  అసంతృప్తితో ఉన్నారు.ఈ విషయం తెలుసుకున్న  పార్టీ నేతలు ఆయనను బుజ్జగిస్తున్నారు. బుధవారంనాడు హైద్రాబాద్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీతో భేటీకి కూడ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దూరంగా ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో భేటీ అయ్యారు.  అయితే పార్టీ కంటే తనకు  ఆత్మగౌరవం ముఖ్యమని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  సంపత్ కుమార్ తో వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ పార్టీలో కీలక పదవులను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆశించారు. కానీ ఆయనకు ఏ పదవులు దక్కలేదు. గతంలో పీసీసీ చీఫ్ పదవిని ఆశించారు. కానీ ఆ పదవికి రేవంత్ రెడ్డిని  కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నియమించింది.  అయితే  సీడబ్ల్యూసీలో  స్థానం దక్కుతుందని  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆశించారు. కానీ సీడబ్ల్యూసీలో స్థానం దక్కలేదు. మరో వైపు కాంగ్రెస్ పార్టీ ఇటీవల ప్రకటించిన  కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీలో కూడ  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి చోటు దక్కలేదు.  ఈ కమిటీలో  ఉత్తమ్ కుమార్ రెడ్డికి చోటు దక్కింది.ఈ పరిణామాలతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు.  

Latest Videos

undefined

ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణిక్ రావ్ ఠాక్రే  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో భేటీ అయ్యారు. కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ  సమావేశం నుండి  ఠాక్రే నేరుగా  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో  చర్చించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  అసంతృప్తిగా ఉన్న విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్  ఫోన్ చేశారు.చిన్న చిన్న సమస్యలుంటే  పరిష్కరిస్తామని  వేణుగోపాల్ చెప్పారు. ఇవాళ సాయంత్రం హైద్రాబాద్ కు వస్తానని  వేణుగోపాల్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి తెలిపారు.పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి వేణుగోపాల్ హామీ ఇచ్చారు. హైద్రాబాద్ కు వచ్చిన తర్వాత  చర్చించనున్నట్టుగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం  అన్ని విధాలుగా  ఆదుకుంటుందని కేసీ వేణుగోపాల్ వివరించారు.

ఇదిలా ఉంటే  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  అసంతృప్తితో లేరని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణిక్ రావ్ ఠాక్రే  చెప్పారు. ఇవాళ  తాను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడానన్నారు. స్క్రీనింగ్ కమిటీ భేటీ ఉన్నందున వెంకట్ రెడ్డిని కలవలేదన్నారు.  మరో వైపు  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వైబ్రెంట్ లీడర్ అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క  చెప్పారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  అలకబూనే సమస్యే ఉండదన్నారు.

స్క్రీనింగ్ కమిటీ సమావేశం ముగిసిన తర్వాత మాణిక్ రావ్ ఠాక్రే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు  ఆ తర్వాత సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క్ కూడ  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసానికి చేరుకుని  ఆయనతో భేటీ అయ్యారు.  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని బుజ్జగించారు. 


 

click me!