ఒకటి రెండు రోజుల్లో విద్యా సంవత్సరంపై ప్రకటన హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం

By narsimha lodeFirst Published Aug 6, 2020, 2:48 PM IST
Highlights

ఆన్ లైన్, దూర విద్య విధానంలో విద్యాసంవత్సరం ప్రారంభించాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకొన్నట్టుగా ప్రభుత్వం తెలంగాణ హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు ఈ నెల 5వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకొన్నట్టుగా ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.
 


హైదరాబాద్:ఆన్ లైన్, దూర విద్య విధానంలో విద్యాసంవత్సరం ప్రారంభించాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకొన్నట్టుగా ప్రభుత్వం తెలంగాణ హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు ఈ నెల 5వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకొన్నట్టుగా ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.

గురువారం నాడు ఆన్ లైన్ క్లాసులను నిషేధించాలన్న పిల్ పై తెలంగాణ హైకోర్టు విచారించింది. ఒకటి రెండు రోజుల్లో పాఠశాల విద్యా సంవత్సరం ప్రకటిస్తామని తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు వివరించింది. మార్చిలోనే విద్యాసంవత్సరం ప్రారంభించినట్టుగా సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ చెబుతున్నాయని హైకోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది.

ప్రభుత్వ నిర్ణయం రాష్ట్ర విద్యాశాఖ పరిధిలోని స్కూళ్లకే వర్తిస్తోందా అని హైకోర్టు ప్రశ్నించింది. కొన్ని స్కూల్స్ గంటల తరబడి ఆన్ లైన్ పాఠాలు చెబుతున్నాయని కోర్టు తెలిపింది.

ఐదవ తరగతిలోపు  విద్యార్థులు గంటల తరబడి ఆన్ లైన్ లో ఎలా ఉంటారని హైకోర్టు ప్రశ్నించింది. పిల్లలపై మానసిక, శారీరక ప్రభావం ఉంటుందని హైకోర్టు అభిప్రాయపడింది. 

ప్రైవేట్ స్కూల్స్ విధి విధానాలను కూడ ప్రకటిస్తామని తెలంగాణ  ప్రభుత్వం ప్రకటించింది. ఫీజుల జీవోను స్కూల్స్ ఉల్లంఘిస్తున్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు..

ప్రస్తుత దశలో ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. విచారణ పూర్తయ్యాక అవసరమైతే ఫీజులు వెనక్కి ఇవ్వాలని ఆదేశిస్తామని  హైకోర్టు ప్రకటించింది.
ఆన్ లైన్ లో తరగతులపై మరికొంత సమయం కావాలని హైకోర్టును సీబీఎస్ఈ కోరింది.ఈ విషయమై విచారణను ఈ నెల 27వ  తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.


 

click me!