కన్న కూతురికి కూల్ డ్రింక్ లో విషమిచ్చి... తండ్రి ఆత్మహత్య

Published : Aug 06, 2020, 12:05 PM IST
కన్న కూతురికి కూల్ డ్రింక్ లో విషమిచ్చి... తండ్రి ఆత్మహత్య

సారాంశం

కన్న కూతురికి కూతురుకి విషమిచ్చి చంపిన తండ్రి ఆ తర్వాత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. 

కామారెడ్డి: కన్న కూతురికి కూతురుకి విషమిచ్చి చంపిన తండ్రి ఆ తర్వాత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ దారుణానికి కరోనా సృష్టించిన ఆర్థిక కష్టాలే కారణమని తెలుస్తోంది. 

ఈ విషాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి పట్టణంలోనని గుమస్తా కాలనీలో అక్బర్(48) కూతురు సైరా బేగం(14)లు ఇద్దరే వుంటున్నారు. అయితే ఇటీవల కరోనా విజృంభణ, లాక్ డౌన్ విధింపు కారణంగా అక్బర్ ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నాడు. ఈ మధ్య ఆర్థిక ఇబ్బందులు మరీ ఎక్కువవడంతో అతడు దారుణ నిర్ణయం తీసుకున్నాడు.

ముందుగా కూతురు సైరా బేగంకు తండ్రి కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలిపి తాగించి చంపాడు. ఆ తర్వాత అతడు కూడా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇలా తండ్రి కూతురు ప్రాణాలు కోల్పోయారు. 

ఈ ఆత్మహత్యలపై స్థానికులు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ నిర్వహిస్తున్నట్లు కామారెడ్డి రూరల్ పోలీసులు తెలిపారు. 


 

PREV
click me!

Recommended Stories

Tank Bund Ganesh Immersion: ట్యాంక్ బండ్‌పై నిమజ్జనం బంద్.. ఖైరతాబాద్ వినాయకుడి పరిస్థితి ఏంటి? అసలు కారణం ఏంటి?
Weather Update: 3 రోజులు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్