అయోధ్య రామమందిర నిర్మాణానికి శ్రీకారం...అందుకు సంకేతం: బండి సంజయ్

Arun Kumar P   | Asianet News
Published : Aug 06, 2020, 12:38 PM ISTUpdated : Aug 06, 2020, 12:43 PM IST
అయోధ్య రామమందిర నిర్మాణానికి శ్రీకారం...అందుకు సంకేతం: బండి సంజయ్

సారాంశం

రామమందిర నిర్మాణం ప్రారంభమవడం శుభ పరిణామమని తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్  పేర్కొన్నారు. 

హైదరాబాద్: అయోధ్య రామమందిర నిర్మాణానికి బుధవారం శ్రీకారం చుట్టారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ. అయోధ్యలో భూమిపూజ సందర్భంగా యావత్ దేశంలో రామనామస్మరణ మారుమోగింది. ఈ సందర్భంగా తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ తన ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంజయ్ దంపతులిద్దరూ సీతారామస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ... రామమందిర నిర్మాణం ప్రారంభమవడం శుభ పరిణామమన్నారు. దేశంలో హిందుత్వం మరింత బలపడుతోందని చెప్పడారని ఇదే నిదర్శనమన్నారు. ఎంతో మంది త్యాగాల ఫలితంగానే రామమందిర నిర్మాణం సాధ్యమయ్యిందని అన్నారు. 

గతంలో అయోధ్య కోసం కరసేవకులు చేపట్టిన ఉద్యమంలో పాలుపంచుకుని అరెస్టయినట్లు సంజయ్ తెలిపారు. అలా అరెస్టు కావడం కూడా తన  అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం ఎలాంటి అడ్డంకులు లేకుండా నిరాటంకంగా అనుకున్న సమయానికి పూర్తికావాలని కోరుకుంటున్నట్లు సంజయ్ వెల్లడించారు. 

read more   అయోధ్యలో రామ మందిరానికి భూమి పూజ: భద్రాచలంలో ప్రత్యేక పూజలు

పవిత్ర భారత దేశంలో హిందువులు బానిస బతుకులు బతకాల్సిన పరిస్థితి చూశామని, ప్రధాని మోడీ దేశ ప్రజల ఆకాంక్ష నెరవేర్చేలా సంకల్ప దీక్షతో అయోధ్యాపురంలో భూమి పూజ చేయడం యావత్భారత ప్రజలు మర్చిపోలేని రోజన్నారు.

 ఆగస్టు 5వ తేదీన చరిత్ర లిఖించిన రోజని, 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత అయోధ్య రామ మందిరాన్ని నిర్మించుకుంటున్నామని బండి సంజయ్ అన్నారు. అనేక పోరాటాలు, ఉద్యమాలు, సాధు సంతులు, కర సేవకులు అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం బలిదానం చేశారని గుర్తు చేశారు. ఆత్మబలి దానం చేసిన వారికి శక్తివంతమైన ఈ రోజును అంకితం చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

రామ మందిర నిర్మాణం పేరుతో బీజేపీ రాజకీయం చేస్తుందంటూ విమర్శించారని, విదేశీ పాలన కొనసాగడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. సజాతి, ఆత్మాభిమాన పాలన మోదీ నాయకత్వంలో అందించబోతున్నామని బండి వ్యాఖ్యానించారు. ఏనాడూ ఓటు బ్యాంకు రాజకీయాలు బీజేపీ చేయలేదని.. రామరాజ్యం నిర్మాణమే లక్ష్యంగా మోడీ పాలన కొనసాగుతోందన్నారు. 

హిందూ జాతి ఐక్యతగా శక్తివంతమైన నిర్మాణం అయోధ్యలో జరగనుందని, కార్యకర్తగా కరసేవలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని బండి సంజయ్ సంతోషం వ్యక్తం చేశారు. ఆనాడు ములాయం సింగ్ ప్రభుత్వం కాల్చివేతకు పాల్పడిన ఘటనను ఎవరూ మర్చి పోలేరని గుర్తుచేశారు.

PREV
click me!

Recommended Stories

Weather Update: మరో 4 రోజులు దంచికొట్టనున్న వానలు.. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంతో ఆరెంజ్ అలెర్ట్
నేషనల్ మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రెస్ మీట్ | Telangana CM Revanth Reddy Pressmeet