కేబినెట్‌లో 90 శాతం మంది తెలంగాణ ద్రోహులే.. కోవర్టు ఆపరేషన్‌లో ఎర్రబెల్లి ఎక్స్‌పర్ట్: రేవంత్ రెడ్డి

Published : Feb 08, 2023, 10:48 AM IST
కేబినెట్‌లో 90 శాతం మంది తెలంగాణ ద్రోహులే.. కోవర్టు ఆపరేషన్‌లో ఎర్రబెల్లి ఎక్స్‌పర్ట్: రేవంత్ రెడ్డి

సారాంశం

ప్రగతి భవన్‌ను మావోయిస్టులు పేల్చివేసినా ఎవరికీ అభ్యంతరం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. 

ప్రగతి భవన్‌ను మావోయిస్టులు పేల్చివేసినా ఎవరికీ అభ్యంతరం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రేవంత్ వ్యాఖ్యలపై వారు పోలీసులకు కూడా ఫిర్యాదు  చేశారు. ఈ క్రమంలోనే స్పందించిన రేవంత్ రెడ్డి.. తనకు కేసులు  కొత్త కాదని అన్నారు. కేసులకు తాను భయపడనని తెలిపారు. తెలంగాణ జేఏసీ  కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఇంట్లో పుట్టిందని అన్నారు. జేఏసీ అంటేనే జానా  యాక్షన్ కమిటీ అని 

అమరవీరుల స్థూపాలకే ప్రగతి భవన్‌లో ప్రవేశం నిషేధం విధించినప్పుడు అది ఉంటే ఎంత? పోతే ఎంత? అని అన్నారు. తెలంగాణ పదాన్ని  అసహ్యించుకున్నవాళ్లను కేసీఆర్ ప్రగతి భవన్‌లో కూర్చొబెడుతున్నారని విమర్శించారు. దీనిని కేసీఆర్ ఏ విధంగా సమర్ధించుకుంటారని ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రివర్గంలో 90 శాతం తెలంగాణ ద్రోహులే ఉన్నారని విమర్శించారు. అమరవీరుల కుటుంబాల నుంచి ఒక్కరు కూడా మంత్రులుగా ఎందుకు లేరని ప్రశ్నించారు. 

కాంగ్రెస్‌ నుంచి బీఆర్ఎస్‌లోకి మారిన ఎమ్మెల్యేలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఏబీసీడీలు రాని ఎర్రబెల్లి దయాకర్‌రావును మంత్రిగా చేశారని విమర్శించారు. కోవర్డు ఆపరేషన్‌లో ఎర్రబెల్లి దయాకర్ రావు ఎక్స్‌పర్ట్ అని ఆరోపించారు. 

ఇదిలా ఉంటే..  కాంగ్రెస్ పార్టీ చేపట్టిన హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి పాదయాత్ర కొనసాగిస్తున్నారు. బుధవారం ములుగులో జరిగిన రోడ్ షోలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యమవీరుల త్యాగాల వల్ల ఏర్పడిన తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం మాత్రమే లబ్ధి పొందిందని విమర్శించారు. కేసీఆర్ కుటుంబ సభ్యులంతా రాజకీయ పదవులు అనుభవిస్తున్నారని.. త్యాగాలు చేసిన ఒక్క కుటుంబానికి కూడా ప్రయోజనం లేదని రేవంత్ ఆరోపించారు.

ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతిభవన్‌ను మావోయిస్టులు పేల్చివేసినా.. దాని వల్ల ప్రజలకు ఉపయోగం లేదు కనుక ఎవరికీ అభ్యంతరం లేదన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున పది ఎకరాల్లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రగతి భవన్ నిర్మించారని విమర్శించారు.  ప్రగతి భవన్‌ ఆంధ్రా పెట్టుబడిదారులకు ఎర్ర తివాచీ పరిచి, స్వాగతం పలుకుతోందరి ఆరోపించారు. పేదలకు మాత్రం ప్రవేశం లేదన్నారు. ప్రజల కష్టాలను పట్టించుకోని ప్రగతి భవన్ ఎందుకని ప్రశ్నించారు. ఆనాడు గడీలను పేల్చిన నక్సలైట్లు.. బాంబులతో ప్రగతిభవన్‌ను పేల్చివేసిన ప్రజలకు ఒరిగే నష్టం ఏం లేదన్నారు. 

PREV
click me!

Recommended Stories

Telangana Rising Global Summit: రూ.5.75 లక్షల కోట్ల భారీ ఒప్పందాలు.. ప్రపంచ దిగ్గజ సంస్థల క్యూ !
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్