కాంగ్రెస్‌తోనే నా పెళ్లి జరిగింది: రాహుల్

By narsimha lodeFirst Published Aug 14, 2018, 11:38 AM IST
Highlights

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో  తాము  ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు.  ఏపీ రాష్ట్రంలో మెరుగుపడతామని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.


హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో  తాము  ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు.  ఏపీ రాష్ట్రంలో మెరుగుపడతామని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

మంగళవారం నాడు  హైద్రాబాద్‌లో  హరితప్లాజాలో  పలు మీడియా ఎడిటర్లతో కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ సమావేశమయ్యారు.ఈ సమావేశంలో దేశంలో, రెండు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకొన్న పరిణామాలపై  ఆయన చర్చించారు.

 బీజేపీ పాలనలో మీడియాపై, జర్నలిస్టులపై దాడులు విపరీతంగా పెరిగాయని రాహుల్  చెప్పారు. మీడియాకు స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పాలనలో మీడియాకు స్వేచ్ఛ ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

తాను అన్ని మతాలను గౌరవిస్తానని రాహుల్ గాంధీ చెప్పారు. తాను మోడీని వ్యతిరేకించడం లేదన్నారు. మోడీ ఆచరించే సిద్దాంతాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు.  లోక్‌సభలో  తాను మోడీని కౌగిలించుకోవడం ఆయనకు నచ్చలేదన్నారు. 

తన ప్రత్యర్థులను గౌరవించకపోవడం మోడీ లక్షణమని ఆయన దుయ్యబట్టారు.  మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తోందని  రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో  తాము అధికారంలోకి వస్తామని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. మరో వైపు ఏపీలో కూడ తమ పార్టీ పరిస్థితి మరింత మెరుగయ్యే అవకాశం ఉందని  రాహుల్‌గాంధీ ధీమాను వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్ పార్టీతో నా పెళ్లి జరిగిందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. ఎడిటర్స్ సమావేశంలో రాహుల్ గాంధీ ని పెళ్లి గురించి కొందరు ప్రశ్నించారు.ఈ విషయమై రాహుల్ గాంధీ సరదాగా వ్యాఖ్యానించారు. తన పెళ్లి కాంగ్రెస్ పార్టీతో జరిగిపోయిందని ఆయన చెప్పారు. దీంతో ఈ సమావేశంలో పాల్గొన్న ఎడిటర్లంతా నవ్వారు. దీంతో సమావేశంలో రాజకీయ విషయాలతో వాడీ వేడీగా ఉన్న హాల్ లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది.

యూపీ, బీహార్‌ల్లో విపక్షాల పొత్తుల కారణంగా బీజేపీకి 230 సీట్లు రావడం అసాధ్యమని  ఆయన అభిప్రాయపడ్డారు బీజేపీకి 230 సీట్లు రాకపోతే బీజేపీ ప్రధాని అభ్యర్థిగి మోడీ కాకుండా మరోకరిని ఎంపిక చేసే అవకాశం ఉందని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు.

పార్టీ విధానాలను విస్తరించడం తన ముందున్న లక్ష్యంగా రాహుల్ గాంధీ చెప్పారు. 2014 ఎన్నికల కంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశం లేదని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. 

హిందూత్వంపై తనకు నమ్మకం లేదన్నారు.హిందూత్వం ఏ రూపంలో తాను అంగీకరించనని ఆయన చెప్పారు. 

తాను మొదటి నుండి అన్ని  దేవాలయాలను సందర్శిస్తుంటానని ఆయన గుర్తు చేశారు. అయితే తాను దేవాలయాల సందర్శనను మీడియా గతంలో కంటే ఎక్కువగా చూపుతోందని రాహుల్ గాంధీ చెప్పారు. తాను అన్ని మతాలను గౌరవిస్తానని ఆయన చెప్పారు. 

మోడీ ఊహల్లో బతుకుతున్నారని ఆయన చెప్పారు

యూపీ, బీహార్‌ల్లో విపక్షాల పొత్తుల కారణంగా బీజేపీకి 230 సీట్లు రావడం అసాధ్యమని  ఆయన అభిప్రాయపడ్డారు బీజేపీకి 230 సీట్లు రాకపోతే బీజేపీ ప్రధాని అభ్యర్థిగి మోడీ కాకుండా మరోకరిని ఎంపిక చేసే అవకాశం ఉందని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు.

పార్టీ విధానాలను విస్తరించడం తన ముందున్న లక్ష్యంగా రాహుల్ గాంధీ చెప్పారు. 2014 ఎన్నికల కంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశం లేదని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. 
 

ఈ వార్తలు చదవండి

కాంగ్రెస్‌తోనే నా పెళ్లి జరిగింది: రాహుల్

వరుస సమావేశాలతో రాహుల్ బిజీ బిజీ...రెండో రోజు పర్యటన ప్రారంభం

రాహుల్ గాంధీ ఎదగాలి, స్క్రిప్ట్ చదువుతున్నాడు: కేసీఆర్

అవినీతికి హైద్రాబాద్ రాజధాని: కేసీఆర్‌పై రాహుల్ నిప్పులు
 

click me!