వరుస సమావేశాలతో రాహుల్ బిజీ బిజీ...రెండో రోజు పర్యటన ప్రారంభం

By Arun Kumar PFirst Published Aug 14, 2018, 11:16 AM IST
Highlights

 కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో భాగంగా ఇవాళ ఉదయం నుండి బిజీ బిజీగా గడుపుతున్నారు.  పార్టీ బూత్‌ కమిటీ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులతో ఉదయమే రాహుల్‌ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో చేపడుతున్న కార్యక్రమాల గురించి, పార్టీ పరిస్థితి గురించి రాహుల్ బూత్ కమిటీ అధ్యక్షులను అడిగి తెలుసుకున్నారు.

అలాగే కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలన్న దానిపై వారికి దిశానిర్దేశం చేశారు. ఈ టెలికాన్పరెన్స్ లో పార్టీ బైత్ కమిటీ అధ్యక్షులు, అన్ని జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు. ఒకేసారి 31వేల మందితో మాట్లాడేవిధంగా ఈ టెలికాన్ఫరెన్స్ కు ఏర్పాట్లు చేశారు.

ఈ కార్యక్రమం అనంతరం రాహుల్ పార్టీకి చెందిన 40 మంది సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీని రానున్న ఎన్నికల్లో ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై చర్చించారు. అందరూ కలిసి కలిసికట్టుగా పనిచేయాలని రాహుల్ సూచించినట్లు తెలుస్తోంది.

ఇక ఈ సమావేశం అసంతరం 10.30 గంటలకు సీనియర్ ఎడిటర్లు, జర్నలిస్టులతో రాహుల్‌గాంధీ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో దాదాపు 90 మంది వరకు పాత్రికేయులు పాల్గొన్నారు. 

click me!